టిక్‌టాక్ తరహా షార్ట్ వీడియోలు టీవీల్లోకి రావడంతో కొంతమంది యూట్యూబ్ వినియోగదారులు తమ టీవీల్లో యూట్యూబ్ షార్ట్ వీడియోలను చూడటం ప్రారంభించవచ్చని కంపెనీ ప్రకటించింది. YouTube Shorts వీడియోలు 60 సెకన్లు లేదా అంతకంటే తక్కువ నిడివితో ఉంటాయి. ఇవి యూట్యూబ్‌లో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ ఫీచర్ 2019లో లాంచ్ అయిన టీవీ మోడళ్లలో, కొత్త గేమింగ్ కన్సోల్‌ల్లో అందుబాటులో ఉంటుంది.


"త్వరలో మీకు సమీపంలోని టీవీకి... షార్ట్స్! ఈరోజు నుంచి వీక్షకులు ఇంట్లో పెద్ద స్క్రీన్‌పై ఈ వీడియోలను (60 సెకన్లు లేదా అంతకంటే తక్కువ సమయం) ఆస్వాదించగలరు. షార్ట్‌లను టీవీకి విస్తరించడం స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా అనిపించవచ్చు. కానీ ఈ ప్రయాణం ఇక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు." అని యూట్యూబ్ యూఎక్స్ డైరెక్టర్లు బ్రైన్ ఎవాన్స్, మెలానీ ఫిట్జ్‌గెరాల్డ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు.


యూట్యూబ్ షార్ట్స్ టీవీ, స్మార్ట్‌ఫోన్‌లు రెండింటిలోనూ ఉండాలని Google యాజమాన్యంలోని కంపెనీ విశ్వసిస్తోంది. "ఈ క్షణాన్ని సాకారం చేయడానికి షార్ట్స్, టీవీ టీమ్‌లకు చెందిన ప్రోడక్ట్ మేనేజర్‌లు, ఇంజనీర్లు, డిజైనర్లు, పరిశోధకులు కలిసి ఈ కొత్త వీడియో ఫార్మాట్‌ను పెద్ద స్క్రీన్‌పైకి ఎలా తీసుకురావాలో చర్చించారు. టీవీలో షార్ట్స్‌ను ఫీల్ అవ్వడం చాలా ముఖ్యం. కమ్యూనిటీ మొబైల్‌లో చూసే దానికి అనుగుణంగా ఉంటుంది. పెద్ద స్క్రీన్‌పై సహజంగా ఉంటుంది" అని ఎవాన్స్, ఫిట్జ్‌గెరాల్డ్ జోడించారు.


TVలను ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో చూసినప్పటికీ YouTube Shorts వీడియోలు నిలువుగానే ప్లే అవుతున్నాయి.


"షార్ట్స్ ప్రత్యేకమైన అనుభూతిని మా సాంప్రదాయ వీడియో ప్లేయర్‌లో (ఆప్షన్ A) తెలియజేయవచ్చా లేదా వీడియోకి ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాలను (ఆప్షన్ B) బాగా పూరించేలా అనుకూలీకరించాలా అని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇంకో స్టైల్ కూడా ఉంది. అదే ఆప్షన్ సీ. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ షార్ట్‌లు ఒకే సమయంలో స్క్రీన్‌ను నింపుతాయి. టీవీ స్క్రీన్ అదనపు స్థలాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాయి." అని ఎవాన్స్, ఫిట్జ్‌గెరాల్డ్ బ్లాగ్ పోస్ట్‌లో వివరించారు.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?