Oppo F27 5G Launched: ఒప్పో ఎఫ్27 5జీ ఫోన్ మనదేశంలో మంగళవారం లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇందులో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14 స్కిన్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


ఒప్పో ఎఫ్27 5జీ ధర (Oppo F27 5G Price in India)
ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.22,999గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా నిర్ణయించారు. యాంబర్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అలాగే మనదేశంలోని ప్రధాన రిటైల్ అవుట్‌లెట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్ బ్యాంక్, వన్ కార్డు, ఫెడరల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నారు.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


ఒప్పో ఎఫ్27 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Oppo F27 5G Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఒప్పో ఎఫ్27 5జీ పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేన అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 2100 నిట్స్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.


ఇక కెమెరాలవిషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. హాలో లైట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ముందువైపు అందుబాటులో ఉన్న 32 మెగాపిక్సెల్ కెమెరా ద్వారా సెల్పీలు తీసుకోవచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6,బ్లూటూత్ వీ5.3, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. ఒప్పో ఎఫ్27 5జీలో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస 5000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అందించారు.


ఒప్పో ఇటీవలే భారతదేశంలో ఏ3 5జీ అనే బడ్జెట్ మొబైల్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.15,999 నుంచి ప్రారంభం కానుంది.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?