వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ట్యాబ్లెట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్‌ను అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఉంది. ఇంతకు ముందు వెర్షన్‌తో పోలిస్తే వన్‌ప్లస్ కొత్త ట్యాబ్లెట్‌లో కాస్త చిన్న సైజు డిస్‌ప్లే, తక్కువ రిజల్యూషన్, పిక్సెల్ డెన్సిటీ, రిఫ్రెష్ రేట్, బ్రైట్‌నెస్ ఉండనున్నాయి. ఇది ఒక పోర్టబుల్, తేలికైన ట్యాబ్లెట్. మల్టీ మీడియా, స్ట్రీమింగ్ కోసం దీన్ని రూపొందించారు. క్వాడ్ డాల్బీ అట్మాస్ స్పీకర్లు ఈ ట్యాబ్‌లో ఉన్నాయి.


వన్‌‌ప్లస్ ప్యాడ్ గో ధర (OnePlus Tab Go Price in India)
ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న వైఫై ఓన్లీ మోడల్ ధర రూ.19,999గా నిర్ణయించారు. ఇదే ర్యామ్, స్టోరేజ్‌లో ఎల్టీఈ ఆప్షన్ ఉన్న వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ (ఎల్టీఈ) మోడల్‌ను రూ.23,999కు కొనుగోలు చేయవచ్చు.


వన్‌‌ప్లస్ ప్యాడ్ గో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (OnePlus Tab Go Specifications, Features)
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 11.35 అంగుళాల 2.4కే ఎల్సీడీ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పిక్సెల్ డెన్సిటీ 220 పీపీఐగానూ, టచ్ శాంప్లింగ్ 180 హెర్ట్జ్‌గానూ, పీక్ బ్రైట్‌నెస్ 400 నిట్స్‌గానూ ఉంది.


మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ట్యాబ్ వెనకవైపు 8 మెగాపిక్సెల్‌ కెమెరాను అందించారు. ముందువైపు కూడా 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే... వన్‌ప్లస్ ప్యాడ్ గోలో 8000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 33W సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను ఈ ట్యాబ్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 514 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ట్యాబ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆమ్నీబేరింగ్ సౌండ్ ఫీల్డ్, డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్లు కూడా ఉన్నాయి.


వైఫై 5, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో అందించారు. జియోమ్యాగ్నటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సెలరేషన్ సెన్సార్, గైరోస్కోప్, హాల్ సెన్సార్ బోర్డు, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని మందం 0.69 సెంటీమీటర్లు కాగా, బరువు 532 గ్రాములుగా ఉంది.


వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ కూడా త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీనికి వన్‌ప్లస్ ఓపెన్ అని పేరు పెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నెలలోనే ‘వన్‌ప్లస్ ఓపెన్’ మార్కెట్లోకి రానుందని సమాచారం.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial