OnePlus Updates: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కంపెనీ మరో బడ్జెట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్‌పై పనిచేస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022 (MWC 2022) సదస్సులో అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ మనదేశంలో 2022 ద్వితీయార్థంలో లాంచ్ కానుంది. అలాగే వన్‌ప్లస్ 10 ప్రో (OnePlus 10 Pro) మనదేశంలో ఈ నెలలోనే లాంచ్ కానుందని ప్రకటించింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ ఉండనుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పేరు ఇంతవరకు తెలియరాలేదు. కానీ స్పెసిఫికేషన్లు మాత్రం తెలియరాలేదు. దీంతోపాటు తన అత్యంత చవకైన 5జీ ఫోన్ కూడా ఈ సంవత్సరం లాంచ్ కానుందని ప్రకటించింది.


వన్‌ప్లస్ త్వరలో లాంచ్ చేయనున్న స్పెసిఫికేషన్లు (లీక్డ్)
ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. దీంతోపాటు హోల్ పంచ్ కటౌట్ కూడా అందుబాటులో ఉండనుంది. ఇందులో సెల్ఫీ కెమెరా ఉండనుంది.


మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. త్వరలో లాంచ్ కానున్న రియల్‌మీ జీటీ నియో 3లో కూడా ఇదే ప్రాసెసర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వెనకవైపు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను అందించనున్నట్లు సమాచారం. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుందని తెలుస్తోంది. ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. అంటే 15 నిమిషాల్లోపే బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుందన్న మాట.


ఈ ఫోన్ గురించి ఇతర స్పెసిఫికేషన్లు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. వన్‌ప్లస్‌కు మనదేశం కూడా పెద్ద మార్కెట్టే కాబట్టి... మనదేశంలో కూడా ఈ ఫోన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.23,999 నుంచి ప్రారంభం కానుంది. ఇది 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.24,999గా నిర్ణయించారు.


ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2400 పిక్సెల్స్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 65W సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టును కూడా ఇందులో అందించారు.


Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!