Smartphone Microphone: స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు ర్యామ్, ప్రాసెసర్, డిస్‌ప్లే, రిజల్యూషన్, కెమెరా, బ్యాటరీ సహా ఇతర విషయాల గురించి ఖచ్చితంగా తెలుసుకుంటారు. కానీ స్మార్ట్‌ఫోన్‌లోని అతి ముఖ్యమైన భాగం మైక్రోఫోన్ గురించి వివరంగా తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించరు. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మైక్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే మైక్రోఫోన్ లేకుండా మీరు స్మార్ట్‌ఫోన్‌లో మాట్లాడలేరు లేదా అవతలి వైపు నుండి వచ్చే వాయిస్ గురించి తెలుసుకోలేరు. అందువల్ల స్మార్ట్‌ఫోన్‌లలో కనిపించే మైక్రోఫోన్‌ల గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం.
ఇప్పుడు రెండు మైక్రోఫోన్ల పని గురించి మాట్లాడుకుందాం. ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు దిగువన చాలా చిన్న రంధ్రం ఉంటుంది. దీన్ని మనం చూసే ఉంటాం. దాని లోపల మైక్‌ను సెట్ చేస్తారు. ఇది ఎల్లప్పుడూ మన నోటికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి అది మన స్వరాన్ని వెంటనే పట్టుకోగలదు. ఈ మైక్ మన వాయిస్‌ని అవతలి వినియోగదారుడికి పంపిస్తుంది.
రెండో మైక్రోఫోన్ చెవికి సమీపంలో ఉంటుంది. ఈ మైక్ నుంచి శబ్దం రాదు. ఒక్కోసారి ఇది పని చేస్తుందా అనే ఆలోచన వస్తుంది. కాబట్టి చెవి దగ్గర ఉన్న మైక్ మీ చుట్టూ ఉన్న శబ్దాన్ని అడ్డుకుంటుంది.
ఫోన్‌లో మాట్లాడేటప్పుడు రెండు మైక్‌లు ఒకేసారి యాక్టివ్‌గా ఉంటాయి. దిగువ మైక్ మీ వాయిస్‌ని గుర్తిస్తుంది. పై మైక్ చుట్టుపక్కల శబ్దాన్ని గుర్తిస్తుంది. రెండు వాయిస్‌లు స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్‌కు చేరుకుంటాయి. ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్ ఎగువ మైక్రోఫోన్ నుంచి వచ్చే శబ్దాన్ని చాలా తెలివిగా తొలగిస్తుంది. ఈ ప్రక్రియను నాయిస్ క్యాన్సిలేషన్ అంటారు. కాబట్టి ఇక నుంచి స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే ముందు మైక్ గురించి కూడా తెలుసుకోండి.
మరోవైపు లావా బ్లేజ్ 2 5జీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన లావా బ్లేజ్ 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మూడు కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. లావా బ్లేజ్ 2 5జీలో 6.56 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, వెనక రెండు కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన వేరియంట్ ధరను రూ.9,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న టాప్ స్పెక్ వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్ కలర్ ఆప్షన్లలో లావా బ్లేజ్ 2 5జీ కొనుగోలు చేయవచ్చు.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?