నోకియా సీ01 ప్ల‌స్ స్మార్ట్ ఫోన్ మ‌న‌దేశంలో లాంచ్ అయింది. ఇందులో ఆండ్రాయిడ్ 11(గో ఎడిష‌న్) ఆప‌రేటింగ్ సిస్టంను అందించారు. 5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. ఈ ఫోన్ కు రెండు సంవ‌త్స‌రాల పాటు సెక్యూరిటీ అప్ డేట్లు రానున్నాయి.


నోకియా సీ01 ప్ల‌స్ ధ‌ర‌
ఇందులో కేవ‌లం ఒక్క వేరియంట్ మాత్ర‌మే అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్ తో వ‌చ్చిన ఈ వేరియంట్ ధ‌ర‌ను రూ.5,999గా నిర్ణ‌యించారు. నోకియా.కాం, అమెజాన్, ఇత‌ర ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్ల‌లో దీన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు. బ్లూ, ప‌ర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయ‌వ‌చ్చు.


దీనిపై జియో ఎక్స్ క్లూజివ్ ఆఫ‌ర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. జియో వినియోగ‌దారుల‌కు దీనిపై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ల‌భించ‌నుంది. మైజియో యాప్ లేదా ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉన్న రిటైల్ స్టోర్ల‌లో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే.. ఈ త‌గ్గింపును అందుకోవ‌చ్చు. దీంతోపాటు ఈ ఫోన్ లో సిమ్ వేసి రూ.249తో రీచార్జ్ చేస్తే.. మింత్రా, ఫార్మా ఈజీ, ఓయో, మేక్ మై ట్రిప్ స‌ర్వీసులకు సంబంధించి రూ.4,000 వ‌ర‌కు లాభాలు ల‌భించ‌నున్నాయి.


నోకియా సీ01 ప్ల‌స్ స్పెసిఫికేష‌న్లు
ఇందులో 5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 18ః9గా ఉంది. 1.6 గిగాహెర్ట్జ్ యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెస‌ర్ పై ఈ ఫోన్ ప‌నిచేయ‌నుంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండ‌నున్నాయి. స్టోరేజ్ ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 128 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు.


ఫోన్ వెన‌క‌వైపు 5 మెగాపిక్సెల్ హెచ్ డీఆర్ కెమెరాను అందించారు. ముందువైపు 2 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ రెండు కెమెరాల్లోనూ ఎల్ఈడీ ఫ్లాష్ అందుబాటులో ఉంది. 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఇందులో అందించారు. ఒక్క‌సారి పూర్తిగా చార్జ్ చేస్తే నోకియా సీ01 ప్ల‌స్ ను రోజంతా ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని కంపెనీ అంటోంది.


ఆండ్రాయిడ్ 11(గో ఎడిష‌న్) ఆప‌రేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ ప‌నిచేయ‌నుంది. ఆండ్రాయిడ్ 10(గో ఎడిష‌న్)తో పోలిస్తే.. ఆండ్రాయిడ్ 11(గో ఎడిష‌న్)లో డేటా వాడ‌కం 60 శాతం త‌గ్గుతుందని, యాప్ లాంచింగ్ 20 శాతం వేగంగా జ‌రుగుతుందని కంపెనీ అంటోంది. ఇందులో ఫేస్ అన్ లాక్ ఫీచ‌ర్ ను అందించారు.


యాక్సెల‌రో మీట‌ర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.9 సెంటీమీట‌ర్లుగానూ, బ‌రువు 157 గ్రాములుగానూ ఉంది. ఈ ఫోన్ కు రెండు సంవ‌త్స‌రాల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తామ‌ని కంపెనీ తెలిపింది.


Also Read: Realme New Phone: రూ.10 వేలలోపే రానున్న రియ‌ల్ మీ కొత్త ఫోన్.. అదిరిపోయే కెమెరా!


Also Read: Apple Event 2021: టెక్ ఈవెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ రేపే.. ఐఫోన్ల‌తో పాటు లాంచ్ అయ్యేవి ఇవే!


Also Read: Affordable Cars: త‌క్కువ ధ‌ర‌లో కారు కొనాల‌నుకుంటున్నారా.. రూ.4 ల‌క్ష‌ల్లో టాప్-3 ఇవే!