క‌రోనావైర‌స్ పాండ‌మిక్ కార‌ణంగా ప్ర‌జ‌లు ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడ‌టానికి ఎక్కువ‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు. క‌రోనావైర‌స్ నుంచి త‌మను తాము కాపాడుకోవ‌డానికి ఎక్కువ‌గా వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌నే ఉప‌యోగిస్తున్నారు. అయితే క‌రోనావైర‌స్ కార‌ణంగా ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి కూడా త‌గ్గింది. దీంతో మ‌న‌దేశంలో ఎంట్రీ లెవ‌ల్ వాహ‌నాలకు విప‌రీతంగా డిమాండ్ పెరిగింది. ఒక‌వేళ మీరు ఎంట్రీ లెవ‌ల్ కార్ల‌కోసం చూస్తున్న‌ట్లయితే.. రూ.4 ల‌క్ష‌ల బ‌డ్జెట్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ కార్లు ఇవే.


1. మారుతి సుజుకి ఆల్టో
మ‌న‌దేశంలో అత్య‌ధికంగా అమ్ముడుపోయే ఎంట్రీ లెవ‌ల్ వాహ‌నాల్లో మారుతి సుజుకి ఆల్టో ముందంజ‌లో ఉండ‌నుంది. 796 సీసీ పెట్రోల్ ఇంజిన్ ను ఇందులో అందించారు. 47 బీహెచ్ పీ, 69 ఎన్ఎం పీక్ టార్క్ ను ఈ కారు అందించ‌నుంది. ఫైవ్ స్పీడ్ మ్యాన్యువ‌ల్ గేర్ బాక్స్ ను ఇందులో అందించ‌నున్నారు.


రూ.4 ల‌క్ష‌ల‌లోపు ఇందులో ఆల్టో ఎల్ఎక్స్ఐ(ఓ) వేరియంట్ ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. డ్యూయ‌ల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, యాబ్స్, ఈబీడీ, రివ‌ర్స్ పార్కింగ్ సెన్సార్లు, ప‌వ‌ర్ స్టీరింగ్, ఫ్రంట్ ప‌వ‌ర్ విండోస్, ఏసీ ఇందులో ఉండ‌నున్నాయి. ఒక‌వేళ ఇంకొంచెం ఎక్కువ ఖ‌ర్చు చేస్తే ఇందులో టాప్ వేరియంట్ కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందులో ఏడు అంగుళాల ట‌చ్ స్క్రీన్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.


ధ‌ర: రూ.3.15 ల‌క్ష‌ల నుంచి రూ.4.26 ల‌క్ష‌ల వ‌ర‌కు(ఎక్స్-షోరూం)


2. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో
మారుతి ఎస్-ప్రెస్సోలో 1.0 లీట‌ర్ ఇంజిన్ ను అందించ‌నున్నారు. 67 బీహెచ్ పీ, 90 ఎన్ఎం పీక్ టార్క్ ఉండ‌నున్నాయి. ఇందులో ఫైవ్ స్పీడ్ మ్యాన్యువ‌ల్ గేర్ బాక్స్, ఫైవ్ స్పీడ్ ఏజీఎస్ వేరియంట్లు ఉన్నాయి. రూ.4 ల‌క్ష‌ల బ‌డ్జెట్ లో ఎంట్రీ లెవ‌ల్ ఎస్టీడీ, ఎస్టీడీ(ఓ) వేరియంట్లు ఉండ‌నున్నాయి.


వీటిలో డ్యూయ‌ల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, డిజిట‌ల్ ఇన్ స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్, రివ‌ర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఈబీడీ ఉన్న యాబ్స్, స్పీడ్ అలెర్ట్ సిస్టం ఉండ‌నున్నాయి. ఇక హ‌య్య‌ర్ వేరియంట్ల‌లో మ‌రిన్ని అడ్వాన్స్డ్ ఫీచ‌ర్లు ఉండ‌నున్నాయి.


ధ‌ర: రూ.3.78 ల‌క్ష‌ల నుంచి రూ.5.14 ల‌క్ష‌ల వ‌ర‌కు(ఎక్స్-షోరూం)


3. డాట్స‌న్ రెడి-గో
ఇందులో రెండు ఇంజిన్ ఆప్ష‌న్లు ఉన్నాయి. 0.8 లీట‌ర్, 1.0 లీట‌ర్ యూనిట్ల‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే రూ.4 ల‌క్ష‌ల‌లోపు 0.8 లీట‌ర్ వేరియంట్ అందుబాటులో ఉండ‌నుంది. ఇందులో ఏసీ, ప‌వ‌ర్ స్టీరింగ్, ఈబీడీ ఉన్న యాబ్స్, డ్రైవ‌ర్ సైడ్, రివ‌ర్స్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలెర్ట్ సిస్టం, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.


ఇక టాప్ ఎండ్ మోడ‌ల్లో ఆండ్రాయిడ్ ఆటోను స‌పోర్ట్ చేసే 8 అంగుళాల ట‌చ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్ మెంట్ సిస్టం, యాపిల్ కార్ ప్లే, వాయిస్ రిక‌గ్నిష‌న్, ఫ్రంట్ ప‌వ‌ర్ విండోస్ వంటి ఫీచ‌ర్లు ఉండ‌నున్నాయి. అయితే ఈ వేరియంట్ కొనాలంటే బ‌డ్జెట్ మ‌రికాస్త పెంచాల్సి ఉంటుంది. ఇందులో కూడా ఫైవ్ స్పీడ్ మాన్యువ‌ల్ గేర్ బాక్స్ అందించ‌నున్నారు.


ధ‌ర: రూ.3.78 ల‌క్ష‌ల నుంచి రూ.5.14 ల‌క్ష‌ల వ‌ర‌కు(ఎక్స్-షోరూం)


Also Read: Apple Event 2021: టెక్ ఈవెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ రేపే.. ఐఫోన్ల‌తో పాటు లాంచ్ అయ్యేవి ఇవే!


Also Read: Realme New Phone: రూ.10 వేలలోపే రానున్న రియ‌ల్ మీ కొత్త ఫోన్.. అదిరిపోయే కెమెరా!


Also Read: JioBook Laptop: జియో చ‌వ‌కైన ల్యాప్ టాప్ వ‌చ్చేస్తుంది.. ఫీచ‌ర్లు కూడా లీక్!