రియ‌ల్ మీ సీ25వై స్మార్ట్ ఫోన్ మ‌న‌దేశంలో సెప్టెంబర్ 16వ తేదీన లాంచ్ కానుంది. ఈ విష‌యాన్ని కంపెనీ అధికారికంగా ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ ను కూడా విడుద‌ల చేసింది. అయితే ఈ ఫోన్ గురించి కీల‌క స్పెసిఫికేష‌న్లు మ‌రే ఇత‌ర స‌మాచారం ఇందులో అందించ‌లేదు. ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండ‌నుంది. అయితే ఈ ఫోన్ ధ‌ర గురించి ఎటువంటి వివ‌రాలు తెలియ‌రాలేదు.


సెప్టెంబ‌ర్ 16వ తేదీన మధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు రియ‌ల్ మీ సీ25వై లాంచ్ కానుంద‌ని కంపెనీ అధికార‌క ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేష‌న్లు, ఇదే త‌ర‌హాలో ఇత‌ర కంపెనీలు విడుద‌ల చేసిన స్మార్ట్ ఫోన్ల ఫీచ‌ర్లు చూస్తే దీని ధ‌ర రూ.10 వేల‌లోపే ఉండే అవ‌కాశం ఉండ‌నుంది.


రియ‌ల్ మీ సీ25వై స్పెసిఫికేష‌న్లు
కంపెనీ విడుద‌ల చేసిన ప్రెస్ నోట్ ప్ర‌కారం.. రియ‌ల్ మీ సీ25వైలో యూనిసోక్ టీ610 ప్రాసెస‌ర్ ఉండ‌నుంది. 50 మెగాపిక్సెల్ కెమెరాను ఇందులో అందించ‌నున్నారు. దీనికి సంబంధించిన మిగ‌తా వివ‌రాల‌ను కంపెనీ ప్ర‌క‌టించ‌లేదు. అయితే వినియోగ‌దారులు ఈ స్మార్ట్ ఫోన్ రోజంతా ఉప‌యోగించేందుకు ఫీచ‌ర్లను ఈ ఫోన్ ద్వారా అందించ‌నున్న‌ట్లు రియ‌ల్ మీ ప్ర‌క‌టించింది.


ప్రెస్ నోట్ తో పాటు రియ‌ల్ మీ విడుదల చేసిన ఫొటోలు చూసిన‌ట్లయితే.. ఇందులో వాట‌ర్ డ్రాప్ త‌ర‌హా నాచ్ డిస్ ప్లే ఉండ‌నుంది. ఈ నాచ్ లోనే సెల్ఫీ కెమెరాను అందించ‌నున్నారు. డిస్ ప్లే సైజు తెలియ‌రాలేదు. ఫోన్ కు కుడివైపు సిమ్ ట్రే ఉండ‌నుంది. వెన‌క‌వైపు నాలుగు కెమెరాల‌ను చ‌తుర‌స్రాకారంలో అమర్చారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెన‌క‌వైపు ఉండ‌నుంది.


రియ‌ల్ మీ సీ25 సిరీస్ లో ఇప్ప‌టికే రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవే రియ‌ల్ మీ సీ25, రియ‌ల్ మీ సీ25ఎస్. ఇప్పుడు లాంచ్ కానున్న రియ‌ల్ మీ సీ25వై ఈ సిరీస్ లో మూడో ఫోన్ కానుంది. రియ‌ల్ మీ సీ25 ధ‌ర రూ.9,999గానూ, రియ‌ల్ మీ సీ25ఎస్ ధ‌ర రూ.10,999గానూ ఉంది.


Also Read: JioBook Laptop: జియో చ‌వ‌కైన ల్యాప్ టాప్ వ‌చ్చేస్తుంది.. ఫీచ‌ర్లు కూడా లీక్!


Also Read: Apple Event 2021: టెక్ ఈవెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ రేపే.. ఐఫోన్ల‌తో పాటు లాంచ్ అయ్యేవి ఇవే!


Also Read: జియో యూజ‌ర్ల‌కు బ్యాడ్ న్యూస్.. ఈ రెండు చ‌వ‌కైన ప్లాన్లు తీసేసిన కంపెనీ!