జియోబుక్ ల్యాప్ టాప్ మనదేశంలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ల్యాప్ టాప్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) వెబ్ సైట్లో కనిపించినట్లు తెలుస్తోంది. ఈ ల్యాప్ టాప్ మూడు వేరియంట్లలో ఈ సర్టిఫికేషన్ వెబ్ సైట్లో లిస్ట్ అయింది. ఇందులో 4జీ కనెక్టివిటీ ఉండనుందని తెలుస్తోంది. స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని లాంచ్ తేదీ తెలియరాలేదు.
ఈ ల్యాప్ టాప్ బీఐఎస్ సర్టిఫికేషన్ ను మొదట ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ గుర్తించారు. NB1118QMW, NB1148QMW, NB1112MM మోడల్ నంబర్లతో ఈ ల్యాప్ టాప్ ఆన్ లైన్ లో కనిపించింది. దీన్ని బట్టి ఇందులో మూడు వేరియంట్లు ఉంటాయని చెప్పవచ్చు.
జియోబుక్ స్పెసిఫికేషన్లు(అంచనా)
గతంలో వచ్చిన లీకుల ప్రకారం ఇందులో హెచ్ డీ(1,366 x 768 పిక్సెల్ రిజల్యూషన్) డిస్ ప్లేను అందించనున్నారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్ టాప్ పనిచేసే అవకాశం ఉంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64 జీబీ ఈఎంఎంసీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండనున్నట్లు సమాచారం.
మినీ హెచ్ డీఎంఐ కనెక్టర్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. త్రీ యాక్సెస్ యాక్సెలరోమీటర్, క్వాల్ కాం ఆడియో చిప్ కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం.
జియో స్టోర్, జియో మీట్, జియో పేజెస్ వంటి యాప్స్ ను ఇందులో ముందే ఇన్ స్టాల్ చేసి విక్రయించనున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఎంఎస్ ఆఫీస్ వంటి ఉపయోగపడే మైక్రోసాఫ్ట్ యాప్స్ కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం.
జియోబుక్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. అయితే ఎప్పుడు లాంచ్ అయినా సరే ఈ జియోబుక్ ల్యాప్ టాప్ బడ్జెట్ ధరలోనే లాంచ్ కానుందని అంచనా వేయవచ్చు.
Also Read: Apple Event 2021: టెక్ ఈవెంట్ ఆఫ్ ద ఇయర్ రేపే.. ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే!
Also Read: జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రెండు చవకైన ప్లాన్లు తీసేసిన కంపెనీ!
Also Read: ఈ 50 గ్రాముల డివైస్ మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చేస్తుంది.. మనదేశంలో లాంచ్!
Also Read: 55 అంగుళాల 4కే డిస్ ప్లే, వీడియో కెమెరా వంటి ఫీచర్లు.. అదిరిపోయే స్మార్ట్ టీవీ వచ్చేసింది!