ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా.. ఎడ్జ్ సిరీస్‌లో ఇటీవల రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అవి మోటొరోలా ఎడ్జ్ 20, మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్. ఇప్పుడు ఇదే ఎడ్జ్ 20 సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. దీని పేరు మోటొరోలా ఎడ్జ్ (2021). ఎడ్జ్ 20 ఫోన్లకు అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఇది అమెరికా మార్కెట్లోకి అడుగుపెట్టింది.


మోటొరోలా ఎడ్జ్ (2021)లో 144Hz రిఫ్రెష్ రేట్ అందించారు. మొదటి జనరేషన్ మోటొరోలా ఎడ్జ్, మోటొరోలా ఎడ్జ్ ప్లస్ ఫోన్లలో ఇచ్చిన రిఫ్రెష్ రేట్‌తో పోలిస్తే ఇది దాదాపు 60 శాతం ఎక్కువగా ఉంది. ఈ ఫోన్ త్వరలోనే కెనాడాలో కూడా లాంచ్ కానుంది. అయితే ఇండియాలో ఎప్పుడు విడుదల చేస్తారనే వివరాలు తెలియరాలేదు. 


మోటొరోలా ఎడ్జ్ 2021 ధర..
ఇందులో కేవలం 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర 699 డాలర్లుగా (సుమారు రూ.52,000) నిర్ణయించారు. నెబ్ల్యూలా బ్లూ అనే కలర్ ఆప్షన్ లో మాత్రమే లభిస్తుంది. వీటి ప్రీ ఆర్డర్లు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. ప్రారంభ ఆఫర్ కింద వీటిని 499 డాలర్లకు (సుమారు రూ.37,200) అందిస్తున్నారు. మోటొరోలా ఎడ్జ్ 20 లైట్ ఫోన్ ఫీచర్లే దాదాపుగా ఇందులో కూడా ఉన్నాయి. 


Also Read: Motorola Edge 20 Fusion: మోటొరోలా నుంచి మిడ్ రేంజ్ ఫోన్.. ఫీచర్లలో మాత్రం తగ్గేదేలే..


మోటొరోలా ఎడ్జ్ 2021 స్పెసిఫికేషన్లు
మోటొరోలా ఎడ్జ్ (2021).. ఆండ్రాయిడ్ 11 ఆధారిత మైయూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే అందించారు. హెచ్‌డీఆర్10 సపోర్టుతో ఇది పనిచేయనుంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్, 576Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. యాస్పెక్ట్ రేషియా 20.5:9గా, స్క్రీన్ టు బాడీ రేషియో 90.6గా ఉంది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌, ఎడ్రినో 642ఎల్ జీపీయూతో కలిసి పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. 


ఇందులో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా ఉండనుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్‌గా ఉంది. దీనికి 30W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్ కూడా ఉంది. బ్యాటరీ లైఫ్ రెండు రోజుల వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది. భద్రత కోసం ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు అందించారు. 


కనెక్టివిటీ ఆప్షన్లుగా.. 5జీ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటివి ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సెలరో మీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్ (కంపాస్), బారోమీటర్ వంటి సెన్సార్లు అందించారు. దీని బరువు 200 గ్రాములుగా ఉంది. 


Also Read: Motorola Edge 20: వన్‌ప్లస్ నార్డ్ 2కు గట్టి పోటీ ఇచ్చే మోటొరోలా ఎడ్జ్ 20 వచ్చేసింది.. ఆగస్టు 24 నుంచి సేల్ స్టార్ట్..


Also Read: Smartphone Updates: ఆగస్టు, సెప్టెంబరులో విడుదల కానున్న స్మార్ట్ ఫోన్లు ఇవే...