How Satellite Phone Works: స్మార్ట్‌ఫోన్, శాటిలైట్ ఫోన్ రెండూ ఆధునిక కమ్యూనికేషన్ సాధనాలు. కానీ అవి పనిచేసే విధానం భిన్నంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ సాధారణ టెలికాం నెట్‌వర్క్‌పై ఆధారపడి పని చేస్తుంది. కానీ శాటిలైట్ ఫోన్ మాత్రం నేరుగా శాటిలైట్స్‌కు కనెక్ట్ అవ్వడం ద్వారా పని చేస్తుంది. శాటిలైట్ ఫోన్ ఎలా పనిచేస్తుంది? స్మార్ట్ ఫోన్‌కు, శాటిలైట్ ఫోన్‌కు మధ్య ఉన్న తేడా ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్‌ఫోన్, శాటిలైట్ ఫోన్ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటి?
స్మార్ట్‌ఫోన్‌లు సాధారణంగా టెలిఫోన్ టవర్లు, ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ల ద్వారా పని చేస్తాయి. కాలింగ్, మెసేజింగ్, ఇంటర్నెట్ వినియోగం కోసం వారికి 4జీ, 5జ లేదా వైఫై నెట్‌వర్క్‌లు అవసరం. నెట్‌వర్క్ కవరేజ్ లేకపోతే స్మార్ట్‌ఫోన్ ద్వారా కమ్యూనికేషన్ చేయలేం.
మరోవైపు శాటిలైట్ ఫోన్‌లు టెలికాం టవర్‌లకు బదులుగా అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలకు నేరుగా కనెక్ట్ అవుతాయి. దీని అర్థం ఏ నెట్‌వర్క్ టవర్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. దట్టమైన అడవులు, ఎడారులు, సముద్రాలు లేదా పర్వత ప్రాంతాలు వంటి టెలికాం నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రదేశాలలో శాటిలైట్ ఫోన్‌లను ఉపయోగించవచ్చు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
శాటిలైట్ ఫోన్ ఎలా పని చేస్తుంది?
శాటిలైట్ ఫోన్‌లు నేరుగా ఉపగ్రహాలతో కమ్యూనికేట్ చేసే ప్రత్యేక యాంటెన్నాను కలిగి ఉంటాయి. మీరు కాల్ చేసినప్పుడు లేదా మెసేజ్ పంపినప్పుడు సిగ్నల్ నేరుగా శాటిలైట్‌కు చేరుతుంది. ఈ సిగ్నల్ మరొక శాటిలైట్ లేదా గ్రౌండ్ స్టేషన్ ద్వారా రిసీవర్‌కు ప్రసారం అవుతుంది. ఈ ప్రాసెస్ సాధారణ మొబైల్ నెట్‌వర్క్ కంటే ఎక్కువ సమయం, శక్తిని తీసుకుంటుంది.
శాటిలైట్ ఫోన్ల ప్రయోజనాలు
నెట్‌వర్క్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. భూకంపాలు లేదా వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మిలటరీ, సెర్చ్, రెస్క్యూ కార్యకలాపాలలో కూడా ఉపయోగపడుతుంది. అయితే శాటిలైట్ ఫోన్లు ఖరీదైనవి, పెద్దగా ఉంటాయి. అలాగే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని దేశాల్లో వీటి వినియోగం పరిమితం అవుతుంది.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?