Smartphones Under 10000: కొత్త సంవత్సరం ప్రారంభమైన వెంటనే ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారుల కోసం పెద్ద తగ్గింపులను అందిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్న వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మీ బడ్జెట్ రూ. 10,000 కంటే తక్కువగా ఉంటే కచ్చితంగా ఈ ఆఫర్‌లను చూడండి. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లను నో కాస్ట్ ఈఎంఐ, సులభమైన వాయిదాలలో కూడా కొనుగోలు చేయవచ్చు.
పోకో సీ61 (POCO C61)
ఈ స్మార్ట్‌ఫోన్ 33 శాతం తగ్గింపుతో కేవలం రూ. 5,999కి లభిస్తుంది. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మీరు దీన్ని నెలకు రూ. 291 నో-కాస్ట్ ఈఎంఐపై కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో డ్యూయల్ కెమెరా, బేసిక్ ఫీచర్లు ఉంటే చాలు కోరుకునే వారికి ఈ ఫోన్ సరిపోతుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం05 (Samsung Galaxy M05)
ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.6,999కి అందుబాటులో ఉంది. ఇది వెనకవైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. పెద్ద బ్యాటరీ, మంచి కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్ తక్కువ ధరలో మంచి ఆప్షన్.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
పోకో సీ75 (POCO C75)
ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 22 శాతం తగ్గింపు తర్వాత రూ. 8,499కి అందుబాటులో ఉంది. ఇది 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీన్ని నెలకు రూ. 299 నో కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు. దీని బలమైన బ్యాటరీ బ్యాకప్, గొప్ప కెమెరా ఈ ఫోన్‌ను మంచి ఆప్షన్‌గా మార్చాయి.
మోటొరోలా జీ35 5జీ (Motorola G35 5G)
ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 20 శాతం తగ్గింపు తర్వాత రూ. 9,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వస్తుంది. ఇది ఫ్యూచర్ నెట్‌వర్క్‌ల కోసం కూడా సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రూ.10,000 కంటే తక్కువ ధరకు అనేక ఇతర స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ వినియోగం, ప్రాధాన్యతల ప్రకారం ఇతర మోడళ్లను కూడా పరిగణించవచ్చు.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?