Vivo Y18T Launched: వివో వై18టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సైలెంట్‌గా లాంచ్ అయింది. కంపెనీ వై-సిరీస్ ఫోన్లలో భాగంగా ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐపీ54 రేటెడ్ బిల్డ్ అందించారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
వివో వై18టీ ధర (Vivo Y18T Price in India)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.9,499గా నిర్ణయించారు. జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వివో, ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Also Read: వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!
వివో వై18టీ స్పెసిఫికేషన్లు (Vivo Y18T Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269 పీపీఐ డెన్సిటీ, 840 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌గా ఉంది. యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై వివో వై18టీ రన్ కానుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్ అందించారు. ర్యామ్‌ను 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు 0.08 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వివో వై18టీలో ముందు వైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.
బ్లూటూత్ వీ5.2, ఎఫ్ఎం రేడియ్, జీపీఎస్, బైదు, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, ఓటీజీ, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, మోటార్ గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
వివో వై18టీలో 15W ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఉన్న 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే ఇది 62.53 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్, 6.8 గంటల పబ్జీ ప్లేబ్యాక్ టైమ్‌ను ఇది డెలివర్ చేయనుంది. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 185 గ్రాములుగా ఉంది.
వివో మనదేశంలో ఎన్నో మంచి ఫోన్లను లాంచ్ చేసింది. వివో వీ-సిరీస్ ఫోన్లకు మనదేశంలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు వివో కొత్త బడ్జెెట్ ఫోన్ కూడా లాంచ్ చేసింది. దీనికి మార్కెట్లో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి!
Also Read: అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!