Apple iPhone 15: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ మరోసారి తన జెండాను ఎగరేసింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా ఐఫోన్ 15 నిలిచింది. కొత్త నివేదిక ప్రకారం ఐఫోన్ 15 ఈ సంవత్సరం ప్రజలకు బాగా నచ్చింది. దానికి సంబంధించి లక్షల్లో యూనిట్లు అమ్ముడయ్యాయి.


కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం ఐఫోన్ 15 తర్వాత ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 15 ప్రో అత్యధికంగా అమ్ముడైన మోడల్స్‌లో ఉన్నాయి. మొత్తం ఐఫోన్ విక్రయాల్లో సగం వరకు ప్రో మోడల్స్ నుంచి రావడం యాపిల్ చరిత్రలోనే ఇదే తొలిసారి.



Also Read: అనుకున్న దాని కంటే ముందే ఆండ్రాయిడ్ 16 - ఎప్పుడు రానుందంటే?


జనాల్లో పెరుగుతున్న కొనుగోలు శక్తి
ప్రస్తుత రోజుల్లో ఖరీదైన ఫోన్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారని నివేదిక పేర్కొంది. అందుకే ఐఫోన్ బేస్, ప్రో మోడళ్ల విక్రయాలలో పెద్దగా తేడా లేదు. ఇది కాకుండా యాపిల్ అందిస్తున్న ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆప్షన్లు, ట్రేడ్ ఇన్ ప్రోగ్రామ్ కూడా సేల్స్‌ పెరగడంలో కీలక పాత్ర పోషించింది. ఇక్కడ పాత మోడల్‌ను కొత్త మోడల్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఐఫోన్ 15 అమ్మకాలలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది.


శాంసంగ్‌కు కూడా ఆధిపత్యం
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 ఫోన్ల జాబితాలో శాంసంగ్ గరిష్టంగా ఐదు మోడళ్లను కలిగి ఉంది. దీని తర్వాత ఈ జాబితాలో యాపిల్‌కి సంబంధించి నాలుగు ఫోన్లు, షావోమీకి సంబంధించి ఒక ఫోన్ ఉన్నాయి. 2018 తర్వాత తొలిసారిగా గెలాక్సీ ఎస్ సిరీస్‌లోని మోడల్ టాప్ 10లో స్థానం సంపాదించుకోగలిగింది. ఈ విషయాన్ని నివేదికలో పేర్కొంది. ఈసారి గెలాక్సీ ఎస్24 మూడో త్రైమాసికంలో టాప్ 10లో చోటు దక్కించుకుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ దాని జెన్ఏఐ ఫీచర్ల సమర్థవంతమైన మార్కెటింగ్ కారణంగా అమ్మకాలు పెరిగాయి. ఇది కాకుండా గెలాక్సీ ఏ-సిరీస్‌కు సంబంధించిన నాలుగు మోడళ్లు కూడా టాప్ 10 జాబితాలో ఉన్నాయి ఇవి ప్రధానంగా తక్కువ ధర విభాగంలో ముందంజలో ఉన్నాయి. ఇది కాకుండా షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ 13సీ 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందనను అందుకుంది.



Also Read: యాపిల్, గూగుల్‌కు శాంసంగ్ పోటీ - ఎస్25 స్లిమ్ లాంచ్ త్వరలో!