Android 16 Release Date: ఆండ్రాయిడ్ 16 కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు శుభవార్త వచ్చింది. ఆండ్రాయిడ్ 16 విడుదల తేదీని గూగుల్ వెల్లడించింది. త్వరలో ఆండ్రాయిడ్ 16 రాబోతోందని గూగుల్ అధికారికంగా ధృవీకరించింది. ఇటీవల డెవలపర్ బ్లాగ్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK) రిలీజ్, క్వార్టర్లీ అప్‌డేట్‌లను కలిగి ఉండే ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను రిలీజ్ చేయాలనే ఆలోచనను గూగుల్ షేర్ చేసింది. యూజర్ ఎక్స్‌పీరియన్స్, డెవలపర్ సపోర్ట్ రెండింటినీ మెరుగుపరచడం దీని లక్ష్యం.
2025 ఏప్రిల్, జూన్‌లో లాంచ్...
ఆండ్రాయిడ్ డెవలపర్స్ బ్లాగ్ ఇటీవల చేసిన బ్లాగ్ పోస్ట్ ప్రకారం 2025 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి జూన్ మధ్య) ఆండ్రాయిడ్ 16 లాంచ్ కానుంది. ఆండ్రాయిడ్ 15ను గూగుల్ ఇటీవలే లాంచ్ చేసింది. అయిలే ఆండ్రాయిడ్ 16ను ఎందుకు ఇంత ముందుగా లాంచ్ చేస్తోంది అనేది ప్రశ్న. వాస్తవానికి కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌ను కొత్త స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లతో ఒకేసారి లాంచ్ చేయడానికి వీలుగా తాము దీన్ని చేస్తున్నామని గూగుల్ చెబుతోంది. ఇది వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ ఎకో సిస్టంలో డివైస్ లాంచ్‌ల షెడ్యూల్‌తో మెరుగైన సమన్వయాన్ని సృష్టించడం దీని ఉద్దేశ్యం.
Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
బ్లాగ్ పోస్ట్‌లో తెలిపిన ప్రకారం దీనికి సంబంధించిన అప్‌డేట్లు కూడా త్వరగా రానున్నాయి. అందుకే ఆండ్రాయిడ్ 16 కూడా ముందే లాంచ్ కానుంది. ఈ పోస్ట్ 2025లో చిన్న అప్‌డేట్‌లను విడుదల చేయడాన్ని సూచిస్తుంది. దీని కారణంగా డెవలపర్‌లు కొత్త ఫీచర్లు, ఏపీఐలను త్వరగా పొందవచ్చు. ఇది వారి యాప్‌లను త్వరగా అప్‌డేట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఫుల్ ప్లాన్ ఇదే...
వార్తల్లో తెలుపుతున్న దాని ప్రకారం... ఆండ్రాయిడ్ 16 విడుదలైన తర్వాత గూగుల్ 2025 మూడో త్రైమాసికంలో మరో అప్‌డేట్‌ను విడుదల చేస్తుంది. దీని తర్వాత కంపెనీ నాలుగో త్రైమాసికంలో ఆండ్రాయిడ్ 16 ఎస్‌డీకేని విడుదల చేస్తుంది. ఈ రిలీజ్‌లు అన్నీ కొత్త ఏపీఐలు, ఫీచర్లతో లాంచ్ కానున్నాయి. దీని వల్ల యాప్ డెవలపర్స్... తమ యాప్స్‌ను చాలా త్వరగా కొత్త వెర్షన్‌కు తగ్గట్లు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?