Realme GT 7 Pro Camera Features: రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో నవంబర్ 26వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ ఫోన్ చైనాలో ఈ నెల ప్రారంభంలోనే ఎంట్రీ ఇచ్చింది. రియల్‌మీ జీటీ 7 ప్రో భారతీయ వేరియంట్ చైనీస్ మోడల్‌కు చాలా దగ్గరగా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రానుందని తెలుస్తోంది. దీని డిజైన్ కూడా దాదాపు అలాగే ఉండనుంది. ఇప్పుడు రియల్‌మీ ఈ ఫోన్‌కు సంబంధించిన కెమెరా స్పెసిఫికేషన్లు, ఫీచర్లను రివీల్ చేసింది.


అండర్ వాటర్ ఫొటోగ్రఫీ కూడా...
రియల్‌మీ జీటీ 7 ప్రో ద్వారా అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయవచ్చని కంపెనీ తెలిపింది. కేస్ కూడా లేకుండా ఈ ఫోన్ ద్వారా నీటిలో ఫొటోలు తీయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇందులో ఉన్న ఐపీ69 రేటెడ్ బిల్డ్ ద్వారా ఇది సాధ్యం కానుంది. ఈ ఫీచర్ ద్వారా 2 మీటర్ల లోతులో 30 నిమిషాల పాటు దీన్ని ఉపయోగించవచ్చు. సోనిక్ వాటర్ డ్రెయినింగ్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. దీని ద్వారా స్మార్ట్ ఫోన్ స్పీకర్‌లో నీటి బిందువులు నిలవవు.



Also Read: అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!


చైనాలో రియల్‌మీ జీటీ 7 ప్రో ధర
రియల్‌మీ జీటీ 7 ప్రో ధర చైనాలో 3,699 యువాన్ల నుంచి (మనదేశ కరెన్సీలో సుమారు రూ.43,800) ప్రారంభం కానుంది. ఇది బేసిక్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ రేటు  3,999 యువాన్లుగానూ (సుమారు రూ.47,400), 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రేటు  3,899 యువాన్లుగానూ (సుమారు రూ.46,200), 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ రేటు  4,299 యువాన్లుగానూ (సుమారు రూ.50,900), 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ రేటు  4,799 యువాన్లుగానూ (సుమారు రూ.56,900) నిర్ణయించారు. మనదేశంలో కూడా దీని ధర దాదాపు ఇలానే ఉండే అవకాశం ఉంది. మార్స్ ఎక్స్‌ప్లొరేషన్ ఎడిషన్, స్టార్ ట్రయల్ టైటానియం, లైట్ డొమైన్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇండియాలో కలర్ ఆప్షన్లు మారే అవకాశం ఉంది.


రియల్‌మీ జీటీ 7 ప్రో చైనీస్ వేరియంట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
రియల్‌మీ జీటీ 7 ప్రో చైనీస్ వేరియంట్లో 6.78 అంగుళాల 2కే ఎకో2 స్కై స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రియల్‌మీ జీటీ 7 ప్రో రన్ కానుంది. ఇందులో 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15పై బేస్ అయిన రియల్‌మీ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ ఫోన్ పని చేయనుంది. రియల్‌మీ జీటీ 7 ప్రో బ్యాటరీ సామర్థ్యం 6500 ఎంఏహెచ్ కాగా, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.



Also Read: వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!