OnePlus 12 Discount Offer: వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 12 ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి దీనిని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. విశేషమేమిటంటే ఈ తగ్గింపు ఏదైనా ప్రత్యేక సేల్ లేదా ఆఫర్‌లో భాగం కాదు. కాబట్టి ఈ తగ్గింపు ఎంతకాలం అందుబాటులో ఉంటుందో స్పష్టంగా చెప్పలేం. మీరు వన్‌ప్లస్ 12ని కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.
వన్‌ప్లస్ 12 ధర
వన్‌ప్లస్ 12 ధర ఇంతకుముందు రూ. 64,999గా ఉండేది. కానీ ఇప్పుడు ఇది అమెజాన్‌లో రూ. 59,500కి అందుబాటులో ఉంది. అంటే దీనిపై మీరు రూ. 5,499 తగ్గింపును పొందుతున్నారు. ఇది కాకుండా మీరు దానిని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద కొనుగోలు చేస్తే దీని ధర మరింత తగ్గనుంది. ఈ తగ్గింపు ధర అమెజాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి దీన్ని గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.
Also Read: యాపిల్, గూగుల్‌కు శాంసంగ్ పోటీ - ఎస్25 స్లిమ్ లాంచ్ త్వరలో!
వన్‌ప్లస్ 12 స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై రన్ కానుంది. ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల ప్రో ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ 12 పని చేయనుంది. 24 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... వన్‌ప్లస్ 12 వెనకవైపు హాజిల్‌బ్లాడ్ బ్రాండెడ్ మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 64 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలెర్ట్ స్లైడర్ కూడా ఈ ఫోన్‌లో కంపెనీ అందించింది. ఏకంగా 1 టీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో చూడవచ్చు.
వన్‌ప్లస్ 12 యాప్ లాక్, హైడ్ యాప్స్ వంటి ఉపయోగకరమైన ఫీచర్‌లతో సహా, ఫోన్ గొప్ప డిజైన్, క్లీన్ సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. ఈ ఫోన్ నాలుగు సంవత్సరాల పాటు కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌లను, ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని, తద్వారా ఇది చాలా కాలం పాటు సురక్షితంగా ఉంటుందని వన్‌ప్లస్ పేర్కొంది.
ఈ ఫోన్ 5400 ఎంఏహెచ్ బలమైన బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల ఈ ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి వన్‌ప్లస్ 12పై తగ్గింపు మంచి అవకాశం.
వన్‌ప్లస్ ఇటీవలే వన్‌ప్లస్ 13ని కూడా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ భారత దేశ మార్కెట్లో కూడా త్వరలో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.
Also Read: అనుకున్న దాని కంటే ముందే ఆండ్రాయిడ్ 16 - ఎప్పుడు రానుందంటే?