Ulefone Armour 24: ప్రస్తుతం ఉన్న టెక్ యుగంలో చాలా మంది తమ ఫోన్ బ్యాటరీ లైఫ్ వీలైనన్ని ఎక్కువ రోజులు ఉండాలని డిమాండ్ చేస్తారు. కానీ ఎంత సెర్చ్ చేసినా కూడా అలాంటి స్మార్ట్‌ఫోన్‌లు దొరకడం లేదు. దీని కోసం యూలేఫోన్ అనే కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే ఆర్మర్ 24. ఇందులో 22000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
యూలేఫోన్ ఆర్మర్ 24 ఫోన్ ధర
ఆర్మర్ 24 ధరను 239.99 డాలర్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ. 34,400) నిర్ణయించారు. అయితే ప్రస్తుతం దాని లభ్యత గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మీరు ఈ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే కంపెనీ అధికారిక సైట్‌ని సందర్శించాలి. మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో కూడా కంపెనీ తెలపలేదు.
యూలేఫోన్ ఆర్మర్ 24 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
యూలేఫోన్ ఆర్మర్ 24 మొబైల్‌లో 6.78 అంగుళాల డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2460 పిక్సెల్స్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20.5:9 గానూ, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ అందించారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంబిల్ట్ స్టోరేజ్‌ను యూలేఫోన్ ఆర్మర్ 24 కలిగి ఉంది. ర్యామ్‌ను మరో 12 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
కెమెరా సెటప్ గురించి చెప్పాలంటే... ఈ ఫోన్‌లో f/1.79 అపెర్చరు ఉన్న 64 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, f/1.89 అపెర్చర్ ఉన్న 64 మెగాపిక్సెల్ నైట్ విజన్ కెమెరా ఉంది. ముందు భాగంలో f/2.2 అపెర్చర్ ఉన్న 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
ఈ స్మార్ట్‌ఫోన్ 4జీ / ఎల్టీఈ మొబైల్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. యూలేఫోన్ ఆర్మర్ 24 శక్తివంతమైన లైట్ సిస్టమ్, పవర్ బ్యాంక్ ఫంక్షనాలిటీ, కఠినమైన డిజైన్ వంటి మెరుగైన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేసింది.
మరోవైపు టాటా గ్రూప్ భారతదేశంలో ఐఫోన్‌ను అసెంబుల్ చేసే విస్ట్రాన్ ప్లాంట్‌ను కొనుగోలు చేసింది. ఐఫోన్‌ను టాటా గ్రూప్ భారత్‌లో ఉత్పత్తి చేసి అసెంబుల్ చేయనుందని అక్టోబర్ 27వ తేదీన సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్స్/ట్విట్టర్ ద్వారా ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ / ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి ఈ డీల్ ద్వారా భారతదేశంలో ఐఫోన్ రేట్లు తగ్గుతాయో లేదో చూడాలంటే ప్రొడక్ట్ తయారయి బయటకు వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. వినిపిస్తున్న వార్తల ప్రకారం విస్ట్రాన్ ఫ్యాక్టరీ విలువ సుమారు 125 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. గత ఏడాది కాలంగా టాటా గ్రూప్, విస్ట్రాన్ మధ్య ఈ డీల్ గురించి చర్చలు జరుగుతున్నాయి. విస్ట్రాన్ ప్లాంట్ ఐఫోన్ 14 మోడల్ ఉత్పత్తికి చాలా ఫేమస్. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 10 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial