Nokia 105 Classic: నోకియా 105 క్లాసిక్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇన్‌బిల్ట్ యూపీఐ యాప్‌తో రానుంది. అంటే నగదు లావాదేవీలు కూడా చేసుకోవచ్చన్న మాట. వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో కనెక్టివిటీ కూడా ఈ ఫోన్‌లో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌పై ఒక సంవత్సరం రీప్లేస్‌మెంట్ గ్యారంటీ అందిస్తోంది. సింగిల్ సిమ్, డ్యూయల్ సిమ్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.


నోకియా 105 క్లాసిక్ ధర
దీని ధరను రూ.999గా నిర్ణయించారు. బ్లూ, చార్‌కోల్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. సింగిల్ సిమ్, డ్యూయల్ సిమ్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఛార్జర్‌తో, ఛార్జర్ లేకుండా నోకియా 105 క్లాసిక్ అందుబాటులో ఉంది. ఛార్జర్ కావాలంటే కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.


నోకియా 105 క్లాసిక్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
నోకియా 105 క్లాసిక్‌ను వివిధ రకాలుగా డ్యురబులిటీ టెస్టులు చేశారు. ఎంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో అయినా ఈ ఫోన్ పని చేస్తుంది. దీని డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. బటన్ల మధ్య స్పేస్ ఎక్కువగా ఉంది. దీంతో యూజర్ ఎక్స్‌పీరియన్స్ మరింత అద్భుతంగా మారనుంది.


దీని డిటైల్డ్ స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్‌లో 800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉందని కంపెనీ తెలిపింది. ఎక్స్‌టెండెడ్ స్టాండ్‌బై లైఫ్ ద్వారా ఇది మరింత బ్యాటరీ లైఫ్ ఇవ్వనుంది. వైర్‌లెస్ ఎఫ్ఎం కనెక్టివిటీ ఫీచర్ ఈ ఫోన్‌లో ఉంది. దీని ద్వారా ఇయర్ ఫోన్స్ అవసరం లేకుండానే యూజర్లు ఎఫ్ఎం రేడియో ఎంజాయ్ చేయవచ్చు.


ఈ ఫోన్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చని నోకియా తెలిపింది. కానీ ఏ యూపీఐ యాప్‌ను ఇది సపోర్ట్ చేస్తుందో మాత్రం తెలపలేదు. ఈ ఫోన్‌పై ఒక సంవత్సరం రీప్లేస్‌మెంట్ గ్యారంటీ కూడా ఉంది. అంటే ఫోన్ పాడయితే కొత్త యూనిట్‌ను అందించనున్నారు.


నోకియా 105 (2023) మొబైల్ మనదేశంలో రూ.1,299కు అందుబాటులో ఉంది. చార్ కోల్, సియాన్, రెడ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. నోకియా 106 4జీతో పాటు ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. దీని ధర రూ.2,199గా ఉంది.


నోకియా సీ22 స్మార్ట్ ఫోన్ కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఈ మొబైల్ గ్లోబల్‌గా ఇప్పటికే లాంచ్ అయింది. రెండు స్టోరేజ్ వేరియంట్లు, మూడు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐపీ52 రేటింగ్, 2.5డీ డిస్‌ప్లే గ్లాస్, బలమైన మెటల్ ఛాసిస్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో 2 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,999గా నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,499గా నిర్ణయించారు. 


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial