Tecno Phantom V Flip 2 5G Launched: టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో అందుబాటులోకి వచ్చింది. ఇండియాలో లాంచ్ అయిన అత్యంత చవకైన ఫ్లిప్ ఫోన్ ఇదే. ఇది ఒక క్లామ్‌షెల్ ఫ్లిప్ ఫోన్. దీని ఇన్నర్ డిస్‌ప్లే సైజు 6.9 అంగుళాలు కాగా, 3.64 అంగుళాల అవుటర్ డిస్‌ప్లే అందించారు. ఇందులో డాల్బీ అట్మాస్ ఫీచర్లున్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. 70W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ ధర (Tecno Phantom V Flip 2 5G Price in India)
ఈ ఫ్లిప్ ఫోన్ ధర మనదేశంలో రూ.34,999 నుంచి ప్రారంభం కానుంది. టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ కొనుగోలుపై పలు బ్యాంక్ ఆఫర్లు, క్రెడిట్ కార్డు ఆఫర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. దీంతో ఈ ఫ్లిప్ ఫోన్ ధర మరింత తగ్గనుంది. కొన్నాళ్లు పోయాక ఈ ఫ్లిప్ ఫోన్ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. మూన్‌డస్ట్ గ్రే, ట్రావెర్‌టైన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Also Read: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Tecno Phantom V Flip 2 5G Specifications)
ఇందులో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీవో అమోఎల్ఈడీ స్క్రీన్‌ను మెయిన్ డిస్‌ప్లేగా అందించారు. 3.64 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే అవుటర్ స్క్రీన్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 8 ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌ను సపోర్ట్ చేయనుంది. దీని గ్లోబల్ వెర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌తో మార్కెట్లో లాంచ్ అయింది. ఇండియన్ వెర్షన్‌లో ఏ ప్రాసెసర్‌ను అందించారు అనేది తెలియరాలేదు. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది.
ఈ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
డాల్బీ అట్మాస్ ఫీచర్‌ను సపోర్ట్ చేసే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఫోన్‌లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ రన్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4720 ఎంఏహెచ్ కాగా 70W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
Also Read: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!