OnePlus Ace 5 Mini Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ త్వరలో ఒక కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. వినిపిస్తున్న వార్తల ప్రకారం కంపెనీ తన కొత్త ఫోన్ వన్‌ప్లస్ ఏస్ 5 మినీని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ప్రత్యేక ఫీచర్లను వీబోలో వెల్లడించారు. ఈ ఫోన్ డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. కంపెనీ దీన్ని ముందుగా చైనాలో లాంచ్ చేయనుంది.
డిజైన్ , డిస్‌ప్లే ఇలా...
వన్‌ప్లస్ ఏస్ 5 మినీ 6.3 అంగుళాల కస్టమ్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. ఇది 1.5కే రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని డిజైన్ గురించి చెప్పాలంటే కెమెరా వెనకవైపు వర్టికల్‌గా స్థానంలో ఉండనుంది. ఇది చూడటానికి గూగుల్ పిక్సెల్ సిరీస్ లాగా కనిపిస్తుంది. ఈ ఫోన్ కాంపాక్ట్ సైజ్ కారణంగా దీన్ని ఉపయోగించడం మరింత సులభం కానుంది.
కెమెరా ఎలా ఉండనుంది?
ఫోన్ ప్రధాన హైలైట్ దాని 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్906 సెన్సార్ కావచ్చు. అయితే దీనికి పెరిస్కోప్ లెన్స్ ఉండదు. ఈ కెమెరా సెటప్ గొప్ప ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయగలదు.
Also Read: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
పెర్ఫార్మెన్స్ ఎలా ఉండనుంది?
ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌పై రన్ కానుంది. ఇది హై పెర్ఫార్మెన్స్, స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. దీంతో పాటు షార్ట్ ఫోకస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో చూడవచ్చు.
ఎప్పుడు లాంచ్ కానుంది?
డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపిన ప్రకారం ఈ ఫోన్‌ను 2025 రెండో త్రైమాసికంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ డివైస్‌కు సంబంధించి వన్‌ప్లస్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
షావోమీ ఫోన్‌లకు పోటీ...
షావోమీ వంటి బ్రాండ్ల కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా వన్‌ప్లస్ త్వరలో లాంచ్ చేయనున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది. దీని బడ్జెట్ ధర, ప్రీమియం ఫీచర్లు మార్కెట్లో బలమైన ప్లేయర్‌గా మార్చగలవు. వన్‌ప్లస్ ఏస్ మినీ 5 కాంపాక్ట్ సైజులో మంచి పనితీరు, ప్రీమియం ఫీచర్ల గొప్ప కలయికగా అని చెప్పవచ్చు.
Also Read: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?