Discount on Premium Smartphones: భారతీయ మార్కెట్లో ప్రీమియం ఫోన్‌లకు చాలా డిమాండ్ పెరుగుతోంది. దీనికి అతిపెద్ద కారణం వాటిలో గొప్ప ఫీచర్లు అందుబాటులో ఉండటం. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు ఎండ్ ఆఫ్ ది సీజన్ సేల్ ప్రారంభం అయింది. ఈ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 8ఏ, ఐఫోన్ 15 ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందజేస్తున్నారు.
గూగుల్ పిక్సెల్ 8ఏపై తగ్గింపు
ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) స్మార్ట్‌ఫోన్ రూ. 16,000 తగ్గింపును పొందుతుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 52,999 కాగా, ఇప్పుడు ఈ ఫోన్ రూ. 36,999కి లిస్ట్ అయింది. మీరు ఈ ఫోన్ కొనుగోలు చేయడం ద్వారా 16 వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.
ఇది మాత్రమే కాకుండా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2,000 అదనపు తగ్గింపును పొందుతారు. అలాగే మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే ఐదు శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.36,300 వరకు అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు.
Also Read: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
ఐఫోన్ 15పై భారీ తగ్గింపు
ఐఫోన్ 15 (iPhone 15) అసలు ధర రూ. 69,900గా ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ రూ. 58,749కి అందుబాటులో ఉంది. అంటే మీకు 15 శాతం తగ్గింపు లభిస్తుందన్న మాట. ఇది కాకుండా మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 1,000 అదనపు తగ్గింపును పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. అలాగే ఈ ఫోన్‌పై రూ.55,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్ లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంది. డిసెంబర్ 13వ తేదీ వరకు మాత్రమే సేల్ జరగనుంది. ఈ సేల్ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను చవకగా కొనుగోలు చేయాలనుకుంటే ఈ సేల్ సమయంలో బుక్ చేసుకోవచ్చు.
Also Read: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?