Poco F7 Ultra Launch: భారతీయ మార్కెట్లో 5జీ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ రోజురోజుకు పెరిగింది. తక్కువ ధరల్లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లకు ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పోకో తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పోకో ఎఫ్7 అల్ట్రాను త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ మార్కెట్‌లోని అనేక ఫోన్‌లతో పోటీ పడగలదు. దీని ఫీచర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


పోకో ఎఫ్7 అల్ట్రా ఫీచర్లు (అంచనా)
వినిపిస్తున్న వార్తల ప్రకారం పోకో ఎఫ్7 అల్ట్రా మూడు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లతో మార్కెట్లోకి రావచ్చు. ఇందులో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. షావోమీ కొత్త హైపర్ఓఎస్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఇందులో చూడవచ్చు. 



Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?


బ్యాటరీ, కెమెరా ఎలా ఉండనున్నాయి?
పోకో ఎఫ్7 అల్ట్రా బ్యాటరీ, కెమెరా ఫీచర్లు కూడా బయటకు వచ్చాయి. మార్కెట్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ ఫోన్ రెడ్‌మీ కే80 ప్రో రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించవచ్చు. ఈ బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.


కెమెరా సెటప్ ఇలా...
ఇప్పుడు ఈ ఫోన్ కెమెరా సెటప్ గురించి చెప్పాలంటే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు టెలిఫోటో లెన్స్ కూడా చూడవచ్చు. అయితే దీని ఫ్రంట్ కెమెరా గురించి ఎటువంటి సమాచారం బయటకి రాలేదు.


ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల 2కే అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందిస్తారని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ ఎలైట్ చిప్‌సెట్ ప్రాసెసర్ ఇవ్వవచ్చు.



Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!