Tecno Phantom V Fold 2 5G Launched: టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. బుక్ తరహాలో ఉండే ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో మెయిన్ స్క్రీన్ 7.85 అంగుళాలు కాగా, 6.42 అంగుళాల కవర్ డిస్‌ప్లే కూడా ఉంది. ఫోన్ వెనకవైపు ఏకంగా మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండటం విశేషం. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఫాంటం వీ పెన్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు.
టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ ధర (Tecno Phantom V Fold 2 5G Price in India)
టెక్నో లాంచ్ చేసిన ఈ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ధర రూ.79,999 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఇది కేవలం ప్రారంభ ధర మాత్రమే. బ్యాంకు ఆఫర్లు, క్రెడిట్ కార్డు ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. కానీ ఎంత కాలం పాటు ఈ ధర అందుబాటులో ఉండనుందో తెలియరాలేదు. త్వరలో కంపెనీ ధరను మళ్లీ పెంచే అవకాశం ఉంది. డిసెంబర్ 13వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. కార్స్ట్ గ్రీన్, రిప్పింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Also Read: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Tecno Phantom V Fold 2 5G Specificaions)
ఈ స్మార్ట్ ఫోన్‌లో 7.85 అంగుళాల 2కే ప్లస్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ప్రధాన డిస్‌ప్లేగా అందించనున్నారు. బయట వైపు 6.42 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా అందించారు. దీనికి సంబంధించిన గ్లోబల్ వెర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్‌తో రన్ కానుంది. కానీ ఇండియన్ వెర్షన్‌లో ఏ ప్రాసెసర్ అందించారో తెలియరాలేదు. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సల్ పొర్‌ట్రెయిట్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ అందించారు. ప్రధాన కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియా కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ లెన్స్ అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5750 ఎంఏహెచ్ కాగా, 70W వైర్డ్, 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌లను ఇది సపోర్ట్ చేయనుంది. డాల్బీ అట్మాస్ ఫీచర్ ఉన్న స్పీకర్లు ఇందులో ఉండనున్నాయి. టెక్నో ఫాంటం వీ పెన్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఏఐ బ్యాక్డ్ ఇమేజింగ్, ఫొటో ఎడిటింగ్ టూల్స్, గూగుల్ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్ మడిచినప్పుడు దీని మందం 1.19 సెంటీమీటర్లు కాగా, ఓపెన్ చేసినప్పుడు దీని మందం 0.55 సెంటీమీటర్లుగా ఉండనుంది.
Also Read: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!