సోనీ ఎక్స్‌పీరియా 5 వీ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫోన్ కేవలం ఒక్క వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మూడు కలర్ ఆప్షన్లలో సోనీ ఎక్స్‌పీరియా 5 వీ లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సోనీ ఎక్స్‌పీరియా 5 వీ సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు.
సోనీ ఎక్స్‌పీరియా 5 వీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 999 యూరోలుగా (సుమారు రూ.89,700) నిర్ణయించారు. బ్లాక్, బ్లూ, ప్లాటినం సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అవుతుందో లేదో మాత్రం తెలియరాలేదు.
సోనీ ఎక్స్‌పీరియా 5 వీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ హెచ్‌డీఆర్ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 21:9గానూ ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ కూడా అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 52 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 5జీ, 4జీ వోల్టే, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ 3.2 టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కూడా అందించారు. సోనీ ఎక్స్‌పీరియా 5 వీ స్మార్ట్ ఫోన్ మందం 0.86 సెంటీమీటర్లు కాగా, బరువు 182 గ్రాములుగా ఉంది.
Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial