Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Samsung Galaxy S25 Series: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. అదే శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్.
Samsung Galaxy S25 Price in India: శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ప్రతి సంవత్సరం దాని వినియోగదారుల కోసం గొప్ప ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేస్తుంది. అదే శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లు. ఇది వినియోగదారులు మొబైల్ యూజ్ చేసే ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తుంది.
శాంసంగ్ తన ఎస్ సిరీస్‌లో ఈ సంవత్సరం శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను లాంచ్ చేసింది. కంపెనీ ఈ సిరీస్‌ని 2024 జనవరి 17వ తేదీన ప్రారంభించింది. ఇప్పుడు శాంసంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేస్తుంది. అదే శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్. ఈ స్మార్ట్ ఫోన్లు 2025 జనవరిలో లాంచ్ కానున్నాయి.
శాంసంగ్ కొత్త ఎస్ సిరీస్ ఫోన్లు
ఈ ఫోన్ సిరీస్ లాంచ్‌పై అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ గురించి ఎప్పటికప్పుడు లీకులు వస్తూనే ఉన్నాయి. ఈసారి శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ డేట్ కూడా లీక్ అయింది. శాంసంగ్ హోం మార్కెట్ అంటే దక్షిణ కొరియా మీడియా సంస్థ ఎఫ్ఎన్ న్యూస్ నివేదిక ప్రకారం శాంసంగ్ లాంచ్ చేయనున్న ప్రీమియం ఫోన్ సిరీస్ 2025 జనవరి 23వ తేదీన లాంచ్ చేయనుంది.
Also Read: రూ.10 లక్షల్లోపు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లు ఇవే - మహీంద్రా నుంచి మారుతి వరకు!
వివిధ దేశాల కాలమానాన్ని బట్టి శాంసంగ్ స్మార్ట్ ఫోన్ 2025లో జనవరి 22వ తేదీ లేదా 23వ తేదీల మధ్య లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు శాంసంగ్ ఈ ఫోన్ సిరీస్ లాంచ్ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఈసారి శాంసంగ్ ఎస్ సిరీస్ గురించి చెప్పాలంటే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం తన ఎస్ సిరీస్‌లో మూడు కొత్త ఫోన్‌లను విడుదల చేయనుంది. ఇందులో గెలాక్సీ ఎస్ 25, గెలాక్సీ ఎస్ 25 ప్లస్, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ఉన్నాయి. ఇది కాకుండా శాంసంగ్ ఈ సంవత్సరం ఒక ప్రత్యేక మోడల్‌ను కూడా విడుదల చేయనుంది. అది శాంసంగ్ గెలాక్సీ ఎస్25 స్లిమ్ ఎడిషన్ అని తెలుస్తోంది. దీని మోడల్ నంబర్ SM-S937U అని వార్తలు వస్తున్నాయి.
వార్తల ప్రకారం శాంసంగ్ 2025 ఏప్రిల్‌లో ఎస్24 ఫోన్‌కు సంబంధించిన ఈ స్లిమ్ మోడల్‌ను లాంచ్ చేయనుందని తెలుస్తోంది. శాంసంగ్ ఈ సిరీస్‌ని క్వాల్‌కాం తాజా ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో లాంచ్ చేయనుంది.
Also Read: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!