Smartphone Display: స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు డిస్‌ప్లే ఎలా ఉందనేది కూడా చెక్ చేసుకోవాల్సిన కీలకమైన అంశం. ఈ రోజుల్లో నార్మల్ (ఫ్లాట్) డిస్‌ప్లే, కర్వ్డ్ డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రెండూ మీ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని ప్రభావితం చేసే కొన్ని విభిన్న ఫీచర్లను కలిగి ఉన్నాయి. కాబట్టి ఏ డిస్‌ప్లే బెటర్ ఆప్షన్ అని ఇప్పుడు తెలుసుకుందాం.


నార్మల్ (ఫ్లాట్) డిస్‌ప్లే ఎలా ఉంటుంది?
ఫ్లాట్ డిస్ప్లే స్మార్ట్‌ఫోన్‌లు సాధారణంగా సింపుల్ స్క్రీన్‌ను కలిగి ఉంటాయి. ఇందులో ఉండే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఇది చాలా మన్నిక గలది. ఈ డిస్‌ప్లేకు స్క్రీన్ గార్డ్ వేయడం కూడా చాలా సులభం. ఫ్లాట్ డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. యాక్సిడెంటల్ టచ్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ. గేమింగ్, వీడియో వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. దీని కారణంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రజలు చాలా ఇష్టపడతారు.


కర్వ్డ్ డిస్‌ప్లే ఎలా ఉంటుంది?
కర్వ్డ్ డిస్‌ప్లేలు కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు ఆకర్షణీయంగా, ప్రీమియంగా కనిపిస్తాయి. కర్వ్‌డ్ మోడల్లో స్క్రీన్‌లు ఎడ్జెస్ వైపు వంగి ఉంటాయి. ఇది గొప్ప వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. కర్డ్‌డ్ డిస్‌ప్లేలో వీడియోలు, ఫోటోలను చూసే ఎక్స్‌పీరియన్స్ మరింత అద్భుతంగా ఉంటుంది. ఇది వినోదానికి కొత్త కోణాన్ని జోడిస్తుంది. ఇది కాకుండా కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు కర్వ్డ్ డిస్‌ప్లేలో అదనపు షార్ట్‌కట్‌లు, నోటిఫికేషన్ల ఫీచర్‌ను కూడా కలిగి ఉంటాయి. ఇది మల్టీ టాస్కింగ్‌ను కూడా సులభతరం చేస్తుంది.



Also Read: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!


రెండిట్లో ఏది బెస్ట్?
మీరు గేమింగ్‌ ఎక్కువగా చేసే వారు అయినా... లేదా మీ ఫోన్ ఉపయోగించడానికి సులభమైనదిగా ఉండాలని కోరుకుంటే ఫ్లాట్ డిస్‌ప్లే మీకు సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది బడ్జెట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన బ్యాటరీ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. మరోవైపు ప్రీమియం లుక్, డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందాలనుకుంటే లేదా కొంచెం కొత్తగా ఉండాలి అనుకుంటే కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవచ్చు.


మొత్తంమీద ఫ్లాట్ డిస్‌ప్లే ప్రాక్టికల్‌గా ఉంటుంది. అలాగే బడ్జెట్ ఫోన్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఉపయోగించడం సులభంగా ఉంటుంది. అయితే కర్వ్‌డ్ డిస్‌ప్లే ప్రీమియం, అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు కొనుగోలు చేసే స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే మీ అవసరంపై ఆధారపడి ఉంటుంది.


ప్రస్తుతం మనదేశంలో ప్రీమియం ఫోన్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. ప్రీమియం ఫోన్లలో ఎక్కువగా కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందిస్తారు. కాబట్టి ప్రీమియం మోడల్స్‌లో మీకు కర్వ్‌డ్ డిస్‌ప్లే ఆప్షన్లు ఎక్కువ కనిపిస్తాయి. కర్వ్‌డ్ డిస్‌ప్లే చూడటానికి ప్రీమియంగా ఉన్నప్పటికీ చాలా జాగ్రత్తగా వినియోగించాలి. స్క్రీన్ గార్డ్ వేయించేటప్పుడు కూడా మంచిగా వేయాలి. లేకపోతే గమ్ పవర్ బటన్‌లోకి వెళ్లి మనం సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.



Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!