Smartphone Price Hike in 2025: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రోజుకో కొత్త కంపెనీ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. అయితే 2025 సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్లు మరింత ఖరీదైనవిగా మారవచ్చు. దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు.
ఆ మూడు కారణాలూ ఇవే...
వీటిలో మొదటిది మంచి కాంపోనెంట్‌ల ధర పెరగడం. స్మార్ట్ ఫోన్ తయారీకి డిస్‌ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్... వంటి విడి భాగాలు చాలా ముఖ్యం. వీటి ధర ప్రస్తుతం పెరుగుతోంది. దీని కారణంగా స్మార్ట్ ఫోన్ల ధర కూడా పెరగనుంది.
రెండోది 5జీ నెట్‌వర్క్ రాక కారణంగా ఖర్చు పెరగడం. మూడోది ఏఐ లాంటి కొత్త టెక్నాలజీ వినియోగం పెరగడం. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం స్మార్ట్‌ఫోన్ల సగటు ధర 2024 సంవత్సరంలో మూడు శాతం, 2025లో ఐదు శాతం పెరగనుంది. ప్రజలు ఇప్పుడు మరింత శక్తివంతమైన ప్రాసెసర్లు, ఏఐ ఉన్న ఖరీదైన ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు.
Also Read: అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!
జనరేటివ్ ఏఐ కారణంగా స్మార్ట్‌ఫోన్‌లు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి. ఏఐ ఫీచర్లను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. అందుకోసం స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు మరింత పవర్ ఫుల్ సీపీయూ, ఎన్‌పీయూ, జీపీయూతో చిప్‌లను తయారు చేస్తున్నాయి. ఈ చిప్‌ల ధర సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఫోన్ ధర కూడా పెరుగుతుంది. 4 ఎన్ఎం, 3 ఎన్ఎం వంటి కొత్త చిప్ తయారీ టెక్నాలజీ కారణంగా విడిభాగాల ధర కూడా పెరుగుతోంది. ఇది కాకుండా కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి, మెరుగుపరచడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అప్‌గ్రేడ్ అవుతున్న స్మార్ట్ ఫోన్లు
అయితే టెక్నాలజీ డెవలప్ అవుతున్నందున స్మార్ట్‌ఫోన్లు కూడా అప్‌గ్రేడ్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధర పెరగడంతో పాటు మంచి ఫోన్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇందులో మంచి కెమెరా, మరింత తెలివైన వర్చువల్ అసిస్టెంట్ ఉన్నాయి. రాబోయే కాలంలో ప్రత్యేక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను కూడా చూడవచ్చు. ఏఐ వినియోగం పెరుగుతూ ఉండటంతో టెక్ దిగ్గజాలు కూడా ఏఐపై దృష్టి సారిస్తున్నాయి. ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇదే అని చెప్పవచ్చు.
అలాగే ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లోనే కాకుండా మనదేశంలో కూడా ప్రీమియం స్మార్ట్ ఫోన్ల సేల్స్ విపరీతంగా పెరిగాయి. 2024 మూడో త్రైమాసికంలో మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో యాపిల్ రెండో స్థానంలో ఉంది. జులై నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా అమ్ముడు పోయిన స్మార్ట్ ఫోన్లలో యాపిల్ రెండో స్థానంలో నిలిచింది. ఏకంగా 22 శాతం మార్కెట్ షేర్‌ను యాపిల్ మనదేశంలో సొంతం చేసుకోవడం విశేషం. భారతదేశంలోని టైర్ 2, టైర్ 3 సిటీల్లో కూడా ఐఫోన్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. యాపిల్ అందిస్తున్న ఈజీ ఈఎంఐ ఆప్షన్లు కూడా దీని సేల్స్ పెరగడానికి ఒక కారణం.
Also Read: వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!