Cars With 6 Airbags: ప్రస్తుతం ప్రజలు కారును కొనుగోలు చేసే ముందు దాని సెక్యూరిటీ ఫీచర్ల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. బేస్ మోడల్‌లోనే అత్యుత్తమ సెక్యూరిటీ ఫీచర్లను అందించే అనేక కార్ల తయారీ కంపెనీలు ఉన్నాయి. మారుతి నుంచి టాటా, మహీంద్రా నుంచి స్కోడా వరకు ఈ ఆటోమేకర్లు తమ కార్ల బేస్ మోడల్‌లో కూడా సెక్యూరిటీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తారు. మెరుగైన సేఫ్టీ ఫీచర్ల కారణంగా ఈ కార్లలో చాలా వరకు భద్రతలో 5 స్టార్ రేటింగ్‌ను పొందాయి.


మారుతి డిజైర్, స్విఫ్ట్‌తో మొదలు
మారుతి డిజైర్ కొత్త తరం మోడల్ ఇటీవల భారత మార్కెట్లో విడుదలైంది. ఇంతకుముందు ఈ మారుతి కారు ముందు భాగంలో కేవలం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉండేవి. అయితే ఇప్పుడు అప్‌డేట్ చేసిన మోడల్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌తో కూడిన సెక్యూరిటీ ఫీచర్లతో వచ్చింది. దీంతో పాటు కారులో 360 డిగ్రీ కెమెరాను కూడా అమర్చారు. మారుతి డిజైర్ (New Maruti Dzire) భారత్ ఎన్‌సీఏపీ ద్వారా క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది. అదే సమయంలో కొత్త మారుతి స్విఫ్ట్ (New Maruti Swift) బేస్ మోడల్‌లో కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అందించారు.



Also Read: ఒక్క నెలలోనే ఐదు లక్షలకు పైగా సేల్స్ - దుమ్ములేపుతున్న టూ వీలర్ బ్రాండ్ ఇదే!


టాటా కార్లలో కూడా...
భారతదేశంలో టాటా కార్లను సెక్యూరిటీకి గ్యారంటీగా పరిగణిస్తారు. గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన ఆటోమేకర్ మొదటి కారు టాటా నెక్సాన్ (Tata Nexon). ఈ కారు అన్ని వేరియంట్‌లలో సెక్యూరిటీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందించబడ్డాయి. అనేక టాటా కార్లు క్రాష్ టెస్ట్‌లలో 5 స్టార్‌ రేటింగ్స్‌ను పొందాయి. ఇటీవల విడుదల చేసిన టాటా కర్వ్ కూడా ఈ జాబితాలో చేరింది. లాంచ్ అయిన రెండు నెలల తర్వాత ఈ కారు భారత్ ఎన్‌సీఏపీ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ కారుకు సంబంధించిన అన్ని వేరియంట్లలో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్ అందించారు.


మహీంద్రా కార్ల సెక్యూరిటీ ఫీచర్లు
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో కూడా మంచి కారు. దాని బేస్ మోడల్‌లో కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ కారు భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది. దీంతో పాటు మహీంద్రా థార్ రాక్స్, ఎక్స్‌యూవీ400 కూడా క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్‌ రేటింగ్స్‌ను పొందాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.79 లక్షల నుంచి మొదలై రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది.


ప్రస్తుతం మనదేశంలో బడ్జెట్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అలాగే ఇప్పుడు సెక్యూరిటీ ఉన్నకార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీని కారణంగా ఈ కార్లకు సంబంధించిన సేల్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. 



Also Read: రూ.ఏడు లక్షల్లోపు ధరలోనే మారుతి కొత్త డిజైర్ - సేఫెస్ట్ మారుతి కారు ఇదే!