Redmi Note 14 Pro Plus Launched: రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఏకంగా 6200 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.


రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ ధర (Redmi Note 14 Pro Plus Price in India)
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.29,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999గానూ, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.34,999గానూ ఉంది. స్పెక్టర్ బ్లూ, ఫాంటం పర్పుల్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకు దీన్ని కొనుగోలు చేయవచ్చు.


రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Redmi Note 14 Pro Plus Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ 1.0 ఆపరేటింగ్ సిస్టంపై రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల 1.5కే రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ వరకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా ఇందులో ఉంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2560 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, అడాప్టివ్ హెచ్‌డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఈ డిస్‌ప్లేలో ఉన్నాయి. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందించనున్నారు. బ్యాక్ ప్యానెల్‌కు కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ కోటింగ్ ఉంది.


క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది. 12 జీబీ వరకు స్టోరేజ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్‌ను అందించారో లేదో తెలియరాలేదు. దీని బ్యాటరీ సామర్థ్యం 6200 ఎంఏహెచ్ కాగా... 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


Also Read: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!


ఇక కెమెరాల విషయానికి వస్తే... రెడ్‌మీ 14 ప్రో ప్లస్ 5జీలో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


5జీ, వైఫై 6, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, బ్లూటూత్ వీ5.4, జీపీఎస్, గెలీలియో, బైదు, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరోమీటర్, లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, లీనియర్ మోటార్, గైరోస్కోప్, ఐఆర్ కంట్రోల్, ఫ్లికర్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. దీంతో పాటు ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు. డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేసే డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు. దీని మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 210.8 గ్రాములుగా ఉంది.



Also Read: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!