Redmi 13C: 8 జీబీ + 256 జీబీ ఫోన్ రూ.12 వేలలోనే - రెడ్‌మీ 13సీ ఎలా ఉందో చూడండి!

Redmi 13C Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే రెడ్‌మీ 13సీ.

Continues below advertisement

Redmi 13C Affordable Phone: రెడ్‌మీ 13సీ స్మార్ట్ ఫోన్ నైజీరియాలో లాంచ్ అయింది. ఇందులో 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందించారు. వీటిలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాలో ఫొటోలు తీసుకోవచ్చు. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. మూడు వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. హోల్ పంచ్ డిజైన్‌ కూడా ఇందులో ఉంది.

Continues below advertisement

రెడ్‌మీ 13సీ ధర (Redmi 13C Price)
ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 98,100 నైరాలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.10,100) ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 108,100 నైరాలుగానూ (సుమారు రూ.11,000), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 121,100 నైరాలుగా (సుమారు రూ.12,500) నిర్ణయించారు. బ్లాక్, క్లోవర్ గ్రీన్ షేడ్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ నంబర్ సిరీస్‌కు మనదేశంలో కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి త్వరలో ఇండియాలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెడ్‌మీ 12సీ కూడా మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.8,999 నుంచి ప్రారంభం కానుంది.

రెడ్‌మీ 13సీ స్పెసిఫికేషన్లు (Redmi 13C Specifications, Features)
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.74 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. 9ఎన్ఎం మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై రెడ్‌మీ 13సీ రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

మరోవైపు రెడ్‌మీ ఏ2 ప్లస్ స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను కంపెనీ అందించింది. ఇదే రెడ్‌మీ ఏ2 ప్లస్‌కు చేసిన అప్‌గ్రేడ్. షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ లాంచ్ చేసిన లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ మొబైల్‌ మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై పని చేయనుంది. మూడు వేర్వేరు కలర్ ఆప్షన్లలో రెడ్‌మీ ఏ2 ప్లస్ అందుబాటులో ఉంది. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

Continues below advertisement