అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఆన్‌లైన్ పండుగ సేల్స్ మొదటి రోజున రూ. 1,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన 12 లక్షల గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించినట్లు ఎలక్ట్రానిక్స్ మేజర్ కంపెనీ శాంసంగ్ ఇండియా తెలిపింది. పండుగ సీజన్ విక్రయాల కోసం శాంసంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను 17 నుంచి 60 శాతం వరకు తగ్గించింది.


"ఆన్‌లైన్ పండుగ విక్రయాల మొదటి రోజున, Samsung భారతదేశంలో 1.2 మిలియన్లకు పైగా గెలాక్సీ డివైసెస్2లను విక్రయించింది. ఇది భారతదేశంలో సరికొత్త కొత్త రికార్డు. Amazon, Flipkartలో మునుపెన్నడూ చూడని ఆఫర్‌ల కారణంగా ఇది సాధ్యం అయింది. Samsung Galaxy స్మార్ట్‌ఫోన్‌లు అత్యధికంగా డిమాండ్ ఉన్న డివైస్‌ల్లో ఉన్నాయి. నగదు పరంగా చూస్తే, శాంసంగ్ గెలాక్సీ పరికరాలను 24 గంటల్లో రూ. 1,000 కోట్లకు పైగా విక్రయించింది" అని శాంసంగ్ ఒక ప్రకటనలో తెలిపింది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ, గెలాక్సీ ఎస్22 అల్ట్రా, గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎం53, గెలాక్సీ ఎం33, గెలాక్సీ ఎం32 Prime Edition, గెలాక్సీ M13 వంటి స్మార్ట్‌ఫోన్‌ల ధరలను తగ్గించింది.


"అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదటి రోజున, శాంసంగ్ నంబర్ 1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఉంది. అమ్ముడుపోయిన ప్రతి మూడు స్మార్ట్ ఫోన్లలో ఒకటి గెలాక్సీ స్మార్ట్ ఫోన్. ఇక గెలాక్సీ ఎం13 నంబర్ వన్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది." అని Samsung తెలిపింది.


మార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ ప్రకారం, 2022 రెండవ త్రైమాసికంలో 5.7 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్‌లతో శామ్‌సంగ్ 16.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. గత నెల, ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) నివేదిక ప్రకారం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 3 శాతం పెరిగి 35 మిలియన్ యూనిట్లకు చేరుకుందని, చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమీ చార్టులో అగ్రస్థానంలో ఉందని వెల్లడించింది.


ఐడీసీ వరల్డ్‌వైడ్ క్వార్టర్లీ మొబైల్ ఫోన్ ట్రాకర్ నివేదిక ప్రకారం, చైనీస్ బ్రాండ్‌లు ఇప్పుడు భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Realme, Vivo రెండు, మూడు స్థానాలను ఆక్రమించాయి. దీంతో శామ్‌సంగ్ వాల్యూమ్‌ పరంగా నాలుగో స్థానానికి పడిపోయింది. జూన్ 2022 త్రైమాసికంలో 34.7 మిలియన్ యూనిట్ల స్మార్ట్‌ఫోన్‌లు షిప్ అయ్యాయని నివేదిక అంచనా వేసింది. ఇది ఒక సంవత్సరం క్రితం ఇదే కాలంలో అమ్ముడుపోయిన 33.8 మిలియన్ యూనిట్లతో పోలిస్తే 2.9 శాతం ఎక్కువ.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?