అమెజాన్‌లో జరుగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నారు. రెడ్‌మీ ఈ నెలలోనే మనదేశంలో లాంచ్ చేసిన ఏ1 స్మార్ట్ ఫోన్‌ను ఈ సేల్‌లో కేవలం రూ.5,319కే కొనుగోలు చేయవచ్చు. ఇది ఫోన్ అసలు ధర కంటే ఏకంగా 20 శాతం వరకు తక్కువ కావడం విశేషం. అంతేకాకుండా ఈ ఫోన్‌లో ప్యూర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను అందించారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ఇవే
రెడ్‌మీ ఏ1 ధర, అమెజాన్ ఆఫర్
ఈ ఫోన్ మనదేశంలో కేవలం ఒక్క వేరియంట్‌లోనే లాంచ్ అయింది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.6,499గా నిర్ణయించారు. క్లాసిక్ బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో దీని ధర ప్రస్తుతం రూ.6,299కు తగ్గింది. దీనిపై రూ.200 కూపన్‌ను అందించారు. అంటే ఫోన్ ధర రూ.6,099కు తగ్గుతుందన్న మాట. అయితే ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.780 తగ్గింపు లభించనుంది. అంటే రూ.5,319కే ఈ ఫోన్ దక్కించుకోవచ్చన్న మాట. బ్యాక్అప్ స్మార్ట్ ఫోన్ కోసం చూసేవారు, ఇంట్లో పెద్దవాళ్లకు స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
రెడ్‌మీ ఏ1 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. డ్యూయల్ సిమ్‌ను ఇందులో అందించారు. 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో రెడ్‌మీ ఏ1 వచ్చింది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. 20 భారతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించారు.
రెడ్‌మీ ఏ1 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెజాన్‌తో దీంతోపాటు మరిన్ని స్మార్ట్ ఫోన్లపై కూడా భారీ ఆఫర్లను అందించారు.