Nokia C22: నోకియా సీ22 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ మొబైల్ గ్లోబల్‌గా ఇప్పటికే లాంచ్ అయింది. రెండు స్టోరేజ్ వేరియంట్లు, మూడు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐపీ52 రేటింగ్, 2.5డీ డిస్‌ప్లే గ్లాస్, బలమైన మెటల్ ఛాసిస్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది.
నోకియా సీ22 ధర
ఈ ఫోర్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 2 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,999గా నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,499గా నిర్ణయించారు. చార్‌కోల్, పర్పుల్, శాండ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
నోకియా సీ22 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై నోకియా సీ22 పని చేయనుంది. దీని బ్యాటరీ గురించి కంపెనీ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే 10W ఛార్జింగ్ సపోర్ట్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ఫోన్ అందించనుందని తెలుస్తోంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్‌ను కూడా ఈ ఫోన్‌లో అందించారు. ముందు వైపు ఉన్న 8 మెగాపిక్సెల్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు ఉపయోగపడనుంది.
సెక్యూరిటీ కోసం ఫోన్ వెనక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. రెండు సంవత్సరాల పాటు త్రైమాసిక సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు. కానీ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్స్ మాత్రం రావు. అంటే ఆండ్రాయిడ్ 13తోనే ఈ ఫోన్ వాడుకోవాలన్న మాట.
నోకియా సీ12 ప్రో స్మార్ట్ ఫోన్ కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.6,999గా నిర్ణయించారు. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా ఉంది. 2 జీబీ వరకు వర్చువల్ ర్యామ్ పెంచుకోవచ్చు. లైట్ మింట్, చార్ కోల్, డార్క్ సియాన్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. రెండు సంవత్సరాల పాటు రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచెస్‌ను కంపెనీ ఇవ్వనుంది. 12 నెలల పాటు రీప్లేస్‌మెంట్ గ్యారంటీ కూడా లభించనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. దీనికి సంబంధించిన మిగతా ఫీచర్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Also Read: రూ.500లోపు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? - ఎయిర్‌టెల్, జియోల్లో బెస్ట్ ఇవే!