Airtel VS Jio: ఎయిర్ టెల్, జియో భారతదేశంలో రెండు ప్రధాన టెలికాం ఆపరేటర్లు. రెండు టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ ఫైబర్‌తో సహా అనేక రకాల సేవలను అందిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు రెండు కంపెనీలు ఎన్నో డీల్‌లను తీసుకొచ్చాయి. పోస్ట్‌పెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల విభాగంలో మొబైల్ ఆపరేటర్‌లు ఇద్దరూ తమ ప్లాన్‌లను ఇతరుల కంటే మెరుగ్గా ఉంచుతూ వివిధ ప్రయోజనాలను అందిస్తూనే ఉన్నారు. రూ.500లోపు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కేటగిరీలో ఎయిర్‌టెల్, జియో అందిస్తున్న అన్ని డీల్‌లను ఒకసారి చూద్దాం. ఏ కంపెనీ బెస్ట్ ఆఫర్ ఇస్తుందో తెలుసుకుందాం.


రూ. 500 లోపు ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు
ఎయిర్‌టెల్ రూ. 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెలవారీ ప్లాన్. ఇది 40 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ (లోకల్, STD, రోమింగ్), రోజుకు 100 SMS, Airtel థాంక్స్ రివార్డ్‌లను అందిస్తుంది. ప్లాన్ ఎటువంటి ఉచిత కుటుంబ యాడ్ ఆన్ లేదా OTT ప్లాన్‌ను అందించదు.


ఎయిర్‌టెల్ రూ. 499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 75 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ (లోకల్, STD, రోమింగ్), రోజుకు 100 SMS, Airtel థాంక్స్ రివార్డ్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ కింద, 6 నెలల పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, ఒక సంవత్సరం పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్, వింక్ ప్రీమియం, ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ప్లాన్ ఎటువంటి ఉచిత కుటుంబ యాడ్-ఆన్ లేదా OTT సభ్యత్వాన్ని అందించదు.


రూ. 500లోపు జియో  పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు
జియో రూ. 299 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెలవారీ ప్లాన్. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు 30 జీబీ డేటా (తర్వాత ఒక జీబీకి రూ. 10) అందిస్తుంది. ఈ ప్లాన్ కింద జియో వినియోగదారులు JioTV, JioCinema, JioSecurity, JioCloudతో సహా జియో యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు.


జియో రూ. 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెలవారీ ప్లాన్. ఇది 75 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ (లోకల్, STD, రోమింగ్), రోజుకు 100 SMS, ముగ్గురు కుటుంబ సభ్యులకు ఒక సిమ్‌కి అదనంగా 5 జీబీ డేటాను అందిస్తుంది. ప్లాన్ నెలవారీ కోటా ముగిసిన తర్వాత, ప్రతి వన్ జీబీ డేటాకు రూ. 10 ఛార్జ్ చేస్తారు. ఈ ప్లాన్ కింద జియో వినియోగదారులు JioTV, JioCinema, JioSecurity, JioCloud సహా జియో యాప్‌లకు యాక్సెస్ పొందుతారు.


టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లతో రీచార్జ్ చేసుకున్న యూజర్లకు కంపెనీ అదనపు డేటాను కూడా అందిస్తోంది. రూ. 999 ప్లాన్‌ ద్వారా వినియోగదారులకు 40 జీబీ అదనపు డేటాను ఉచితంగా అందజేస్తున్నారు. జియో రూ. 999, రూ. 399, రూ. 219 యొక్క 3 ప్లాన్‌లను ప్రారంభించింది. రూ. 999 ప్లాన్‌లో కస్టమర్‌లు 84 రోజుల పాటు ప్రతిరోజూ 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో కంపెనీ రూ. 241 డేటా వోచర్‌ను కూడా ఉచితంగా ఇస్తోంది. దీని కింద కస్టమర్లు అదనంగా 40 జీబీ డేటాను ఉచితంగా పొందుతారు.


జియో రూ. 399, రూ. 219 ప్లాన్‌లలో కూడా కస్టమర్‌లు ప్రతిరోజూ 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. అయితే రెండు ప్లాన్‌ల వ్యాలిడిటీ వేర్వేరుగా ఉంటుంది. రూ. 399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలో మీరు కంపెనీ నుంచి ఉచితంగా రూ. 61 డేటా వోచర్‌ను పొందుతారు. దీని కింద మీకు 6 జీబీ డేటా అందించనున్నారు. అదే సమయంలో రూ. 219 ప్లాన్‌లో కంపెనీ 2 జీబీ అదనపు డేటాను ఇస్తుంది. దీని వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది.