Trending
Duplicate iPhones: ఎక్కువయిపోతున్న నకిలీ ఐఫోన్లు - ఇలా చేస్తే గుర్తించడం ఈజీ!
Fake iPhones Identification: ప్రస్తుతం మనదేశంలో నకిలీ ఐఫోన్లతో వినియోగదారులు మోసపోతున్న సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. ఐఫోన్ ఒరిజినలా, కాదా అని చెక్ చేయాలో తెలుసుకుందాం.
How To Identify Duplicate iPhones: యాపిల్ ఐఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి స్మార్ట్‌ఫోన్ యూజర్... యాపిల్ స్టైలిష్ డిజైన్, హై లెవల్ సెక్యూరిటీ కారణంగా ఐఫోన్‌లను ఇష్టపడతారు. అయితే చాలా చోట్ల యాపిల్ ఐఫోన్ డూప్లికేట్ మోడల్స్ విక్రయిస్తున్నారు. 2024 నివేదిక ప్రకారం యాపిల్ కేవలం ఐఫోన్ల విక్రయం ద్వారా 39 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఐఫోన్లకు ఉన్న ఆదరణ కారణంగా మార్కెట్ ఇప్పుడు నకిలీ ఐఫోన్లతో నిండిపోయింది. వీటి కారణంగా నగదు చెల్లించి కూడా చాలా మంది మోసపోతున్నారు. ఇప్పుడు ఐఫోన్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నకిలీ ఐఫోన్‌ను ఎలా గుర్తించాలి అనే విషయాలు తెలుసుకుందాం.
ప్యాకేజింగ్‌ను చెక్ చేయండి
ఒరిజినల్ ఐఫోన్ ప్యాకేజింగ్ అధిక నాణ్యతతో ఉంటుంది. బాక్స్‌పై ప్రొడక్ట్‌కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమాచారం ఉంది. దీంతో పాటు బార్‌కోడ్, క్యూఆర్ కోడ్ కూడా ఉంది. దీని ద్వారా ఫోన్ ఒరిజినల్‌నా, కాదా అనేది చెక్ చేయవచ్చు. బాక్స్‌పై బార్‌కోడ్ లేదా క్యూఆర్ కోడ్ లేకపోతే ఫోన్ నకిలీది కావచ్చు. ఐఫోన్ సీరియల్ నంబర్, ఐఎంఈఐ నంబర్‌ను చెక్ చేయడం కూడా చాలా ముఖ్యం.
Also Read: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
సీరియల్ నంబర్‌ను చెక్ చేయండిలా...
ముందుగా మీ ఐఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అక్కడ జనరల్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని అందులో అబౌట్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు సీరియల్ నంబర్ కనిపిస్తుంది. దీన్ని యాపిల్ చెక్ కవరేజ్‌లో రిజిస్టర్ చేయాలి.
ఐఎంఈఐ నంబర్‌ని చెక్ చేయాలి...
మీ ఫోన్‌లో *#06# డయల్ చేయండి. బాక్స్‌పై వ్రాసిన ఐఎంఈఐ నంబర్‌తో దాన్ని మ్యాచ్ చేయండి.
ఐవోఎస్, సాఫ్ట్‌వేర్ వెర్షన్లు చెక్ చేయండిలా...
ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందులో జనరల్‌పై క్లిక్ చేయాలి. అందులో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సెక్షన్‌కి వెళ్లాక ఐవోఎస్ అప్‌డేట్‌ను చెక్ చేయండి. అలాగే సిరికి "హే సిరి" కమాండ్ ఇవ్వండి. సిరి రెస్పాండ్ అయితే ఫోన్ నిజమైందని చెప్పవచ్చు.
యాప్ స్టోర్‌ని చెక్ చేయాలి...
ఐఫోన్‌లో యాప్ స్టోర్ మాత్రమే ఉంటుంది. మీ ఫోన్ యాప్ స్టోర్‌కు సపోర్ట్ చేయకపోతే అది ఫేక్ అవ్వచ్చు. ఈ సింపుల్ ట్రిక్స్‌తో మీరు ఫేక్ ఐఫోన్లకు చెక్ చేయవచ్చు. మోసాలకు గురికాకుండా ఉండవచ్చు.
Also Read: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!