గూగుల్ మేడ్ ఫర్ ఇండియా తొమ్మిదో ఎడిషన్‌లో, చిన్న వ్యాపారవేత్తల కోసం కంపెనీ పెద్ద ప్రకటన చేసింది. ఇప్పుడు చిన్న వ్యాపారులు గూగుల్ పే యాప్ యాప్ ద్వారా సులభంగా రూ. 15,000 వరకు రుణాలు తీసుకోవచ్చు. దీని కోసం కంపెనీ డీఎంఐ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. చిన్న వ్యాపారులతో తమకు ఎదురైన అనుభవాల ఆధారంగా వారికి తరచుగా చిన్న రుణాలు, సులభంగా తిరిగి చెల్లించే ఆప్షన్లు అవసరమని తెలిసిందని కంపెనీ తన ఎక్స్/ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌లో రాసింది. ఈ అవసరాన్ని తీర్చడానికి కంపెనీ DMI ఫైనాన్స్‌తో కలిసి సాచెట్ లోన్‌ను ప్రారంభిస్తోంది.


ఈ సాచెట్ లోన్ ఏమిటి?
వాస్తవానికి, ఇవి మీకు తక్కువ కాల వ్యవధి కోసం ఇచ్చే చిన్న రుణాలు. సాధారణంగా ఇటువంటి రుణాలు ముందుగా ఆమోదం పొందుతాయి. అంటే ప్రీ అప్రూవ్డ్ అన్నమాట. మీకు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ రుణాలు రూ. 10,000 నుంచి రూ. 1 లక్ష వరకు ఉంటాయి. వాటి కాలవ్యవధి ఏడు రోజుల నుంచి 12 నెలల వరకు ఉంటుంది. ఈ రకమైన లోన్ తీసుకోవడానికి, మీరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తంమీద ఇతర రుణాల మాదిరిగా దీనికి ఎక్కువ ప్రాసెస్ అవసరం లేదు.


మంచి విషయం ఏమిటంటే, మీరు ఈ రకమైన సాచెట్ లోన్‌ను నెలకు రూ. 111 నుంచి తిరిగి చెల్లించవచ్చు. అంటే మీ జేబుపై ఎక్కువ భారం పడకుండా, మీరు అవసరమైన సమయంలో గూగుల్ పే నుంచి చిన్నపాటి రుణాలను తీసుకోవచ్చన్న మాట.


రుణం ఎవరికి అందుతుంది?
ప్రస్తుతం కంపెనీ టైర్ 2 నగరాల్లో సాచెట్ లోన్ సదుపాయాన్ని ప్రారంభించింది. నెలవారీ ఆదాయం రూ. 30,000 ఉన్న వ్యక్తులు ఈ సాచెట్ లోన్‌ను సులభంగా పొందవచ్చు.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial