Smartphones Under 15000: భారత మార్కెట్‌లో చవకైన, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లకు చాలా డిమాండ్ ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మనం తక్కువ ధరలో గొప్ప ఫీచర్లను అందించే కొన్ని అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకుందాం. అలాగే ఇవి మార్కెట్లో అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్లు అని చెప్పవచ్చు. ఇందులో వివో నుంచి మోటొరోలా వరకు చాలా కంపెనీల మోడల్స్ ఉన్నాయి.
ఐకూ జెడ్9ఎక్స్ (iQOO Z9x)
ఐకూ జెడ్9ఎక్స్ మనదేశంలో ఈ సంవత్సరం మేలో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ. 12,499గా ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌పై రన్ కానుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అంటుటు స్కోర్ 5,52,168గా ఉంది. ఈ ఫోన్ సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది మంచి బ్యాటరీ బ్యాకప్‌ను కూడా అందిస్తుంది.
వివో టీ3ఎక్స్ (Vivo T3x)
ఈ వివో స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్‌లో లాంచ్ అయింది. వివో టీ3ఎక్స్ అనేది స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌పై పని చేయనుంది. దీని ప్రారంభ ధర రూ.12,999గా ఉంది. ఇది బడ్జెట్ ధరలో గేమింగ్ కోసం ఒక గొప్ప ఆప్షన్. ఈ ధరలో మంచి పనితీరును అందిస్తుంది.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
మోటో జీ64 (Moto G64)
మోటో జీ64 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్‌లో మార్కెట్లోకి వచ్చింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్‌ని కలిగి ఉంది. దీని ధర రూ 13,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ అంటుటు స్కోర్ 4,97,235గా ఉంది. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్, మెరుగైన పని తీరు విషయాల్లో ప్రసిద్ధి చెందింది.
మోటో జీ45 (Moto G45)
మోటో జీ45 స్మార్ట్ ఫోన్ ఆగస్టులో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్‌సెట్‌తో పని చేయనుంది. ఈ డివైస్ మల్టీ టాస్కింగ్, రోజువారీ టాస్క్‌లకు బాగా పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.10,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ అంటుటు బెంచ్ మార్కింగ్ సైట్లో 4,49,055 స్కోర్ సాధించింది.
రెడ్‌మీ 13 (Redmi 13)
రెడ్‌మీ 13 స్మార్ట్ ఫోన్ జూలైలో మార్కెట్లోకి వచ్చింది. దీని ధర రూ. 14,499గా ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌పై రన్ కానుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అంటుటు స్కోర్ 4,45,212. ఇది అద్భుతమైన కెమెరా పనితీరుతో రూ. 15,000 లోపు గొప్ప ఆప్షన్‌గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎంచుకోవడం ద్వారా మీరు మీ బడ్జెట్‌లో మంచి పనితీరు, ఫీచర్లను ఆస్వాదించవచ్చు.
ఇవి మాత్రమే కాకుండా చాలా ఫోన్లు ప్రస్తుతం రూ.15 వేల రేంజ్‌లో అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో ఎక్కువ పోటీ ఉన్నది ఈ ధరల విభాగంలోనే. త్వరలో మరిన్ని ఫోన్లు కూడా ఈ రేంజ్ ధరలతోనే లాంచ్ కానున్నాయి.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!