Apple Event 2023 LIVE: ముగిసిన యాపిల్ ఈవెంట్ - ఐఫోన్ 15 సిరీస్ ధర ఎంత?
Apple Event 2023 LIVE Updates: 2023 యాపిల్ ఈవెంట్ లైవ్ లాంచ్ అప్‌డేట్స్
ఐఫోన్ 15 ప్రో ధర 999 డాలర్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.82,800) నుంచి ప్రారంభం కానుంది. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర 1199 డాలర్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.99,300) నుంచి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్టోరేజ్ 256 జీబీ నుంచి ప్రారంభం కానుంది.
ఐఫోన్ 15 ప్రోలో 48 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన సెన్సార్‌గా అందించారు. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ 3x టెలిఫొటో కెమెరాను అందించారు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 5x జూమ్ ఫీచర్ అందుబాటులో ఉన్న 12 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉంది.
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ల్లో యాపిల్ బయోనిక్ ఏ17 ప్రో ప్రాసెసర్‌ను అందించారు. యాపిల్ ఇంతవరకు రూపొందించిన పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఇదే.
యాపిల్ ఫోన్లలో కనిపించే మ్యూట్ బటన్‌ను కూడా కంపెనీ తీసేసింది. ఇందులో కొత్త యాక్షన్ బటన్ ఉండనుంది. దీని ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాయిస్ రికార్డింగ్‌ను కూడా ఈ బటన్‌తో ప్రారంభించవచ్చు.
నాసా మార్స్ రోవర్‌లో ఉపయోగించిన గ్రేడ్ 5 టైటానియం ఛాసిస్‌ను ఐఫోన్ 15 ప్రోలో ఉపయోగించారు. ఐఫోన్ 15 ప్రోలో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే అందుబాటులో ఉంది.
అమెరికాలో ఐఫోన్ 15 ధర 799 డాలర్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.66,200) నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఐఫోన్ 15 ప్లస్‌ను అమెరికాలో 899 డాలర్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.74,500) నుంచి కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో వీటి ధర ఇంకా ఎక్కువ ఉండవచ్చు.
టైప్-సీ పోర్టుతో లాంచ్ అయిన మొట్టమొదటి ఐఫోన్‌గా ఐఫోన్ 15 సిరీస్ నిలిచింది. ప్రస్తుతం టైప్-సీ యూనివర్సల్‌గా మారింది కాబట్టి 10 సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్న లైట్‌నింగ్ పోర్టును యాపిల్ వదిలేసింది.
ఐఫోన్ 15 సిరీస్‌లో 48 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. ఇందులో 2x టెలిఫొటో జూమ్ కూడా అందుబాటులో ఉంది. మెరుగైన పొర్‌ట్రెయిట్ మోడ్, మెరుగైన బొకే మోడ్ కూడా అందించారు. దీంతోపాటు మెషీన్ లెర్నింగ్ ద్వారా పొర్‌ట్రెయిట్ ఫొటోలు తీసేటప్పుడు హ్యూమన్, యానిమల్ సబ్జెక్ట్స్‌కు ఆటోమేటిక్‌గా స్విచ్ అవుతుంది.
గత సంవత్సరం ప్రో సిరీస్‌లో మాత్రమే కనిపించిన డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్‌ను ఐఫోన్ 15 సిరీస్‌లో కూడా అందించారు. ఐఫోన్ 15లో 6.1 అంగుళాలు, ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉన్నాయి.
యాపిల్ వాచ్ సిరీస్ 9 ధరను కంపెనీ 399 డాలర్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.33,000) నిర్ణయించింది. త్వరలో ఇండియా రేటును కూడా వెల్లడించనున్నారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.
యాపిల్ వాచ్ అల్ట్రా 2ను కంపెనీ తీసుకువచ్చింది. అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో కూడా పని చేసేలా దీన్ని రూపొందించారు. దీనిని నీటి అడుగున కూడా ఉపయోగించవచ్చు. దీని డిస్‌ప్లే అత్యంత ప్రకాశవంతమైన డిస్‌ప్లేగా తయారు అయింది. ఇది తక్కువ పవర్ మోడ్‌లో 72 గంటల పాటు పని చేయనుంది. దీని ప్రకాశవంతమైన డిస్‌ప్లే, కొత్త కలర్ డిజైన్, దాని శక్తివంతమైన S9 చిప్ అన్ని గడియారాల కంటే దీన్ని విభిన్నంగా ఉంచుతాయి. దీని ధర 799 డాలర్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.66,200) ఉంది.
యాపిల్ స్మార్ట్ వాచ్ సిరీస్‌లోని అన్ని స్మార్ట్‌వాచ్‌లలో 100 శాతం గ్రీన్ ఎలక్ట్రికల్ బ్యాండ్‌లను ఉపయోగిస్తున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి కంపెనీ తన అన్ని ఉత్పత్తుల తయారీలో తక్కువ కార్బన్ ఉద్గారాలను లేదా కార్బన్ న్యూట్రల్ భాగాలను ఉపయోగిస్తుంది. 2030 నాటికి అన్ని కర్బన ఉద్గారాలను తగ్గించాలని యాపిల్ నిర్ణయించింది. దీంతోపాటు యాపిల్ కొత్త అడవులను నాటడం, మడ అడవులను పునరుద్ధరిండచం వంటి పనులను కూడా చేస్తుందని పేర్కొంది.
యాపిల్ వాచ్ సిరీస్ 9 మునుపటి కంటే వేగవంతమైనది. ఇందులో కంపెనీ S9 చిప్‌ని ఉపయోగించింది. ఈ స్మార్ట్ వాచ్ ఫుల్ ఛార్జింగ్ తో 18 గంటల పాటు పనిచేస్తుంది. కొత్త సిరీస్‌లో కంపెనీ యూ2, కొత్త అల్ట్రా వైడ్‌బ్యాండ్ చిప్‌ను అందించింది. ఇది మెరుగైన ఫైండ్ మై ఫీచర్‌లను ఎనేబుల్ చేస్తుంది. ఇది కాకుండా కొత్త సిరీస్‌లో మీరు డబుల్ ట్యాప్ ఫీచర్‌ను పొందుతారు. దీని సహాయంతో కేవలం వేళ్లను ట్యాప్ చేయడం ద్వారా మీరు కాల్‌ని పికప్ చేయగలరు, ముగించగలరు. అంతే కాకుండా మరెన్నో జెస్చర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
యాపిల్ కొత్త వాచ్ సిరీస్ 9 స్మార్ట్ వాచ్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది 18 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందించనుందని కంపెనీ పేర్కొంది. దీంతో పాటు సిరి రిక్వెస్ట్‌లను కూడా ఈ డివైస్ సపోర్ట్ చేయనుంది.
ఈ ఈవెంట్లో ఐఫోన్ 15, యాపిల్ వాచ్‌లను లాంచ్ చేయనున్నట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రకటించారు.
యాపిల్ ఇప్పటివరకు లాంచ్ చేసిన ఉత్పత్తులను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. దీంతో పాటు టిమ్ కుక్ 15 అంగుళాల మ్యాక్‌బుక్, యాపిల్ విజన్ ప్రోల గురించి వివరిస్తున్నారు.
యాపిల్ లాంచ్ ఈవెంట్ మరి కొన్ని నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు లాంచ్ కానున్నాయి.
భారతదేశంలో తయారైన ఐఫోన్లు గ్లోబల్ సేల్స్‌లో మొదటి రోజు నుంచే అందుబాటులోకి ఉండనున్నాయి. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. చరిత్రలో ఇదే తొలిసారి.
యాపిల్ సీఈవో టిమ్ కుక్ ‘వండర్‌లస్ట్’ ఈవెంట్ గురించి ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
టెక్ ప్రపంచం అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్న యాపిల్ 2023 ఈవెంట్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.
Background
యాపిల్ ‘వాండర్‌లస్ట్’ లాంచ్ ఈవెంట్ భారతీయ కాలమానం ప్రకారం నేడు (మంగళవారం) రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. అయితే ఏం లాంచ్ కానున్నాయో మాత్రం సీక్రెట్‌గానే ఉంచింది. కానీ గత కొంతకాలంగా దీనికి సంబంధించిన వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఐఫోన్ 15 సిరీస్, కొత్త యాపిల్ వాచ్, యాపిల్ వాచ్ అల్ట్రా మోడల్స్ ఈ ఈవెంట్లో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. దీంతోపాటు ఐవోఎస్ 17 రిలీజ్ డేట్‌ను కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.
యాపిల్ ‘వాండర్‌లస్ట్’ ఈవెంట్ లైవ్ ఎక్కడ చూడవచ్చు?
ఈ కార్యక్రమం కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10:30 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది. యాపిల్ అధికారిక యూట్యూబ్ ఛానెల్, యాపిల్.కామ్ వెబ్ సైట్లో దీన్ని లైవ్ చూడవచ్చు. యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ డెవలపర్ యాప్స్‌లో కూడా ఈ ఈవెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు.
యాపిల్ ‘వాండర్‌లస్ట్’ ఈవెంట్లో ఏం డివైస్‌లు లాంచ్ కానున్నాయి?
యాపిల్ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ కానున్నాయి. వీటిలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయని అందరికీ తెలిసిందే ఈ సిరీస్‌లో ఉన్న ఫోన్లలో కొత్త అప్‌డేటెడ్ ప్రాసెసర్లు అందించనున్నారు. యూఎస్‌బీ టైప్-సీ పోర్టుతో ఈ కొత్త ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి.
ఐఫోన్ 15 సిరీస్ ధరలు కూడా ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ లీకైన వివరాల ప్రకారం ఐఫోన్ 15 రేటులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఈ ఫోన్ ప్రారంభ మోడల్ ధర 799 డాలర్లుగా ఉండవచ్చని తెలుస్తోంది. దీన్ని బట్టి ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కావచ్చు. ఐఫోన్ 13, ఐఫోన్ 14 కూడా మనదేశంలో ఇదే ధరతో లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 15 ప్లస్ ధరను కూడా యాపిల్ పెంచడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ 899 డాలర్లతో అమెరికాలో లాంచ్ కానుందని తెలుస్తోంది. మనదేశంలో రూ.89,900 ధరతో ఎంట్రీ ఇవ్వవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ వేరియంట్ కూడా ఇదే ధరతో మనదేశంలో లాంచ్ అయింది.
ఐఫోన్ 15 ప్రో ధర భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐఫోన్ 14 ప్రో అమెరికాలో 999 డాలర్ల ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు 1,099 డాలర్ల ధరతో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఐఫోన్ 14 ప్రో మనదేశంలో గతేడాది రూ.1,29,900 ధరతో లాంచ్ అయింది. మనదేశంలో ఈ ఫోన్ ధర రూ.1,39,900 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఇది ప్రారంభ స్టోరేజ్ మోడల్ ధర. స్టోరేజ్ పెరిగే కొద్దీ ధర కూడా పెరుగుతుంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 1,099 డాలర్ల ధరతో లాంచ్ అయింది. కానీ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 1,299 డాలర్ల ధరతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. డాలర్లలో చూసుకుంటే 200 డాలర్ల మార్పు ఉండనుంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ అయినప్పుడు దాని ధర మనదేశంలో రూ.1,39,900గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర ఏకంగా రూ.20 వేల పెంపుతో రూ.1,59,900 ధరతో లాంచ్ అయ్యేలా ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే టాప్ ఎండ్ 1 టీబీ వేరియంట్ ధర రూ.2 లక్షలు దాటినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -