E-Waste Management: ఎలక్ట్రానిక్-వ్యర్థాల రీసైక్లర్లకు చెల్లింపులను పెంచే విధానాన్ని రద్దు చేయాలని దక్షిణ కొరియా కంపెనీలు LG, Samsung భారత ప్రభుత్వంపై పిటిషన్ వేశాయి. దీని వ్యాపారం నిర్వహణపై పెను ప్రభావాన్ని చూపుతోందని అనేక ఇతర పెద్ద కంపెనీలు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయని  భారతదేశ పర్యావరణ రూల్స్‌ను సవాలు చేశాయి. ఈ కేసు మంగళవారం విచారణకు రానుంది. వ్యర్థాల నిర్వహణ పద్ధతులపై విదేశీ కంపెనీలు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మధ్య పెరుగుతున్న వివాదానికి ఈ కేసు ఉదాహరణగా నిలుస్తోంది. దీనిపై కీలకమైన ప్రశ్నలను రాయిటర్స్  సందించింది. ఈ ప్రశ్నలకు రెండు కంపెనీలు ఇంకా స్పందించలేదు. ఇటు భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వలేదు.

ఈ కంపెనీలు కూడా మోడీ ప్రభుత్వంపై పిటిషన్ వేశాయిచైనా, US తర్వాత భారతదేశం మూడో అతిపెద్ద ఈ-వ్యర్థాల ఉత్పత్తిదారుగా ఉంటోంది. కానీ గత సంవత్సరం దేశంలోని ఈ-వ్యర్థాలలో 43 శాతం మాత్రమే రీసైకిల్ అయినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ రంగంలో 80 శాతం అనధికారిక స్క్రాప్ డీలర్లు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. వాళ్లు చేస్తున్న రీసైక్లింగ్ పద్ధతులు పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

డైకిన్, భారతదేశానికి చెందిన హావెల్స్, టాటా వోల్టాస్ ఇప్పటికే మోడీ ప్రభుత్వంపై పిటిషన్లు వేశాయి. కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఇతర ఉపకరణాలను రీసైకిల్ చేయడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది, అయితే కంపెనీలు అధిక అనవసరమైన ఖర్చుగా చెబుతున్నాయి. 

ప్రభుత్వం కనీస చెల్లింపును ఎందుకు నిర్ణయించింది?రీసైక్లర్లకు కనీస ఛార్జ్ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా Samsung , LG లాబీయింగ్ చేశాయి. అయితే ప్రభుత్వం ఈ-వేస్ట్ రీసైక్లింగ్‌లో పెట్టుబడులను ప్రోత్సహించడం , ఈ రంగంలోకి మరింత అధికారిక డీలర్లను తీసుకురావడం అవసరమని చెబుతోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనధికారిక వ్యర్థాల రీసైక్లింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. ఈ పనిలో రీసైక్లర్లు పార్టులను తొలగించిన తర్వాత వ్యర్థాలను బహిరంగంగా కాల్చివేస్తున్నారు. లేదా యాసిడ్ లీచింగ్ వంటి పద్ధతులను అవలంబిస్తారు, ఇది పర్యావరణానికి ప్రమాదకరం.

ప్రభుత్వ కొత్త నిబంధనలతో కంపెనీలకు ఇబ్బంది న్యూఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన LG కీలక కామెంట్స్ చేసింది. రీసైక్లర్లకు కనీస మొత్తాన్ని చెల్లించాలన్న నియమం ద్వారా ప్రభుత్వం సాధించాలనుకున్న లక్ష్యాన్ని సాధించలేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందని పేర్కొంది, 'కాలుష్య కారకాల చెల్లింపు' పేరుతో పన్ను విధించడం ద్వారా కంపెనీలను దోచుకోవడమేనని తెలిపింది. ప్రభుత్వం అనధికారిక రీసైక్లర్లను ఈ నిబంధన పరిధిలోకి తీసుకురాలేకపోతే అది పరిపాలన వైఫల్యమేనని కూడా అభిప్రాయపడింది. 

ధర నిర్ణయించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలు సాధించే వీలు లేదని శామ్సంగ్ తన పిటిషన్‌లో పేర్కొంది. దీనికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ వస్తువులను రీసైక్లింగ్ చేయడానికి కిలోకు కనీసం రూ. 22 , స్మార్ట్‌ఫోన్‌లకు కిలోకు రూ. 34 చెల్లించడం తప్పనిసరి అవుతుందని ఇది భారంగా మారుతుందని తెలిపింది. 

స్మార్ట్‌ఫోన్‌ల వంటి తేలికైన గాడ్జెట్‌లతో పోలిస్తే యూనిట్‌కు రీసైక్లింగ్ ఖర్చు గణనీయంగా పెరిగినందున ఇది ఎయిర్ కండిషనర్ తయారీదారులపై ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అమెరికాతో పోలిస్తే భారతదేశ రీసైక్లింగ్ రేట్లు ఇప్పటికీ తక్కువగా ఉన్నాయని పరిశోధనా సంస్థ రెడ్‌సీర్ ఫిబ్రవరిలో తెలిపింది. అమెరికాలో, అవి ఐదు రెట్లు ఎక్కువ, చైనాలో కనీసం 1.5 రెట్లు ఎక్కువ అని వెల్లడించింది.