How To Improve Smartphone Life: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. ఫోన్లు లేకుండా కొద్దిసేపు కూడా జీవించలేని వారు చాలా మందే ఉన్నారు. నిజానికి ఫోన్‌ అవసరం చాలా ఎక్కువగా మారింది. అది లేకుండా పని చేయడం కూడా కష్టంగా మారింది. అందువల్ల ఫోన్‌ను జాగ్రత్తగా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీరు మీ ఫోన్‌ను ఎక్కువ సంవత్సరాలు ఉపయోగించాలనుకుంటే పొరపాటున కూడా చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


నాణ్యత లేని కేబుల్స్ కొనకండి
చాలా సార్లు ఫోన్ ఛార్జర్ పాడైపోయినప్పుడు లేదా పోయినప్పుడు అదనపు కేబుల్ అవసరం అవుతుంది. కొంతమంది తొందరపడి లేదా డబ్బు ఆదా చేయడానికి మార్కెట్ నుండి చవకైన, నాణ్యత లేని కేబుల్‌లను కొనుగోలు చేస్తారు. అలాంటి తప్పు ఎప్పుడూ చేయకూడదు. అలాంటి కేబుల్స్ మొదట చౌకగా అనిపించవచ్చు, కానీ అవి చాలా హాని కలిగిస్తాయి. వాటి కారణంగా ఫోన్ కాలిపోయే ప్రమాదం కూడా ఉంది.


బ్యాటరీ పూర్తిగా అయిపోయేదాకా వాడకండి
చాలా మంది వినియోగదారులు తమ ఫోన్‌ను బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయిపోయే వరకు ఛార్జ్ చేయరు. అలాంటి తప్పును నివారించాలి. బ్యాటరీలో 30 శాతం మిగిలి ఉన్నప్పుడే ఫోన్‌ను ఛార్జ్ చేయాలి. కొన్నిసార్లు మీరు ఫోన్ బ్యాటరీ పూర్తిగా జీరో అయ్యే దాకా ఆగవచ్చు. కానీ సాధారణంగా బ్యాటరీలో 30 శాతం మిగిలి ఉన్నప్పుడు ఛార్జ్ చేయడం మంచిది.


Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?


కవర్ లేదా కేస్ ఉపయోగించాలి
ఫోన్‌లో కవర్ లేదా కేస్‌ని ఉపయోగించడం ప్రయోజనకరం. ఫోన్ అనుకోకుండా చేతి నుంచి జారితే లేదా జేబులోంచి పడిపోతే, కవర్ దానిని దెబ్బతినకుండా కాపాడుతుంది. అందువల్ల కవర్‌పై కొంచెం పెట్టుబడి పెట్టడం వల్ల ఫోన్ జీవితకాలం, రీసేల్ వాల్యూ రెండూ పెరుగుతాయి.


అప్‌డేట్ ఎప్పుడు వచ్చినా చేయాల్సిందే...
కొంతమంది ఫోన్‌ను కొనుగోలు చేసిన తర్వాత దాన్ని అప్‌డేట్ చేయడంలో సోమరితనం చూపిస్తారు. ఇలా వారికి ఒక్కోసారి చాలా హాని చేస్తుంది. చాలా సార్లు కంపెనీలు కొన్ని భద్రతా ముప్పు లేదా బగ్ కారణంగా అప్‌డేట్‌లను విడుదల చేస్తాయి. దీనిని విస్మరించడం వల్ల ఫోన్ నెమ్మదిస్తుంది. కాబట్టి మీ ఫోన్‌ను, దానితో పాటు యాప్‌లను కూడా అప్‌డేట్ చేస్తూ ఉండండి.


నీటితో జాగ్రత్తగా ఉండండి
ఈ రోజుల్లో చాలా ఫోన్‌లు వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తాయి. అందుకే చాలా మంది తమ ఫోన్‌లతో నీటిలోకి వెళ్తూ ఉంటారు. అండర్ వాటర్ సెల్ఫీలు కూడా ఒక పెద్ద ట్రెండ్‌గా మారాయి. అయితే ఈ ఫోన్‌లు వాటర్‌ప్రూఫ్ కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. మొదటిసారి లేదా రెండుసార్లు నీటితో ఫోన్ పాడైపోకపోవచ్చు. కానీ ఎక్కువసేపు నీటిలో ఉండటం వల్ల ఫోన్ దెబ్బతింటుంది. అందువల్ల మీ ఫోన్ వాటర్ రెసిస్టెంట్ అయినా సరే నీళ్లలో పడనివ్వకండి.


 


Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!