200MP Camera Smartphones: స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో కెమెరా అత్యంత ముఖ్యమైన ఫీచర్‌గా మారింది. ఇప్పుడు కంపెనీలు 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ ఫోన్‌లు ఫోటోగ్రఫీని ఇష్టపడేవారిని మాత్రమే కాకుండా అధిక నాణ్యత గల ఫోటోలు, వీడియోలను రూపొందించడంలో కూడా సహాయపడతాయి. మీరు 200 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడ కొన్ని బెస్ట్ ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా (Samsung Galaxy S23 Ultra)
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ప్రస్తుతం 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇది క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ సూపర్‌ ఫాస్ట్‌గా పని చేస్తుంది. ఇందులో 6.8 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది హెచ్‌డీఆర్10+ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.76,560 నుంచి ప్రారంభం అవుతుంది.


మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా (Motorola Edge 30 Ultra)
మోటరోలా 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఎడ్జ్ 30 అల్ట్రాని విడుదల చేయడం ద్వారా ఫోటోగ్రఫీ రంగంలో కొత్త మార్పును సృష్టించింది. ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరాను ప్రైమరీ సెన్సార్‌గా అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఇందులో 6.7 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ. 34,999గా ఉంది.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


రెడ్‌మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro)
రెడ్‌మీ తన నోట్ 13 ప్రో మోడల్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా ఫీచర్‌ను అందించింది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఇది ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌ని కూడా కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్‌ పని చేస్తుంది. ఇది 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ మిడ్ రేంజ్‌లో వస్తుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ.19,999 నుంచి ప్రారంభం కానుంది. ఈ లిస్ట్‌లో ఉన్న చవకైన ఫోన్ ఇదే.


ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా (Infinix Zero Ultra)
ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రాని బడ్జెట్ ఫ్రెండ్లీ 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌ అని చెప్పుకోవచ్చు. ఇది 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ. 36,999గా ఉంది.


200 మెగాపిక్సెల్ కెమెరా, దానికి సరైన ఇమేజ్ ప్రాసెసింగ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు ఫోటోగ్రఫీ, వీడియో మేకింగ్‌ను సరికొత్త స్థాయికి తీసుకువెళతాయి. హై రిజల్యూషన్ ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయడానికి ఈ ఫోన్‌లు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?