JioPhone Prima 4G Price: యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్ సపోర్ట్‌తో జియో కొత్త ఫోన్ - రేటు ఎక్కువా? తక్కువా?

JioPhone Prima 4G: జియోఫోన్ ప్రైమా 4జీ ఫీచర్ ఫోన్‌ను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది.

Continues below advertisement

Jio New Phone: జియో ప్రైమా 4జీ ఫీచర్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 2.4 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. కైఓఎస్ ప్లాట్‌ఫాంపై ఈ ఫోన్ పని చేయనుంది. వాట్సాప్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్, ఫేస్‌బుక్‌లను కూడా ఈ ఫోన్‌తో ఉపయోగించవచ్చు. 23 భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 1800 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్ అందించనుంది. గతవారం మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఈ ఫోన్‌ని కంపెనీ డిస్‌ప్లే చేసింది.

Continues below advertisement

జియో ఫోన్ ప్రైమా 4జీ ధర (JioPhone Prima 4G Price)
ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.2,599గా నిర్ణయించారు. అమెజాన్, జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ఇది అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ తరహా ఫీచర్లున్న ఒక కీప్యాడ్ ఫోన్ కావాలనుకునేవారికి ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

జియోఫోన్ ప్రైమా 4జీ స్పెసిఫికేషన్లు (JioPhone Prima 4G Specifications)
సింగిల్ నానో సిమ్ ఆప్షన్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. కైఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. 2.4 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 240x320 పిక్సెల్స్ కాగా, ఏఆర్ఎం కార్టెక్స్‌టీఎం ఏ53 ప్రాసెసర్‌పై జియో ఫోన్ ప్రైమా 4జీ రన్ కానుంది. 512 ఎంబీ ర్యామ్‌ను అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు.

యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ యాప్స్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. అలాగే జియో యాప్స్ అయిన జియో టీవీ, జియో సినిమా, జియో సావ్న్‌లకు కూడా యాక్సెస్ లభించనుంది. జియో పే యాప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ కూడా చేయవచ్చు.

జియో ప్రైమా 4జీ ఫీచర్ ఫోన్‌లో 0.3 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అందించారు. ఎఫ్ఎం రేడియో, టార్చ్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, బ్లూటూత్ 5 కనెక్టివిటీ ఆప్షన్లు కూడా చూడవచ్చు. ఏకంగా 23 భారతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 1800 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉంది. దీని మందం 1.6 సెంటీమీటర్లు కాగా, బరువు 110 గ్రాములుగా ఉంది.

మరోవైపు ఐటెల్, లావా, నోకియా వంటి మొబైల్ కంపెనీలతో జియో భారత్ 4జీ హ్యాండ్ సెట్ల కోసం రిలయన్స్ జియో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఉన్న 25 కోట్ల 2జీ వినియోగదారులను 4జీకి మార్చాలన్నది జియో లక్ష్యం అని వార్తలు వస్తున్నాయి. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం... ఐటెల్, లావా, నోకియా కంపెనీలతో రిలయన్స్ జియో ఒప్పందం కుదుర్చుకోనుందని తెలుస్తోంది. ఈ కంపెనీలన్నీ తక్కువ బడ్జెట్ జియో ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నాయని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ సునీల్ దత్ తెలిపారు. యూపీఐ పేమెంట్స్, వాట్సాప్, లైవ్ స్ట్రీమింగ్ సపోర్ట్ ఉన్న 4జీ ఫీచర్ ఫోన్‌ను రూ.999కే లాంచ్ చేయడానికి జియో కొంత కాలం నుంచి ప్రయత్నాలు చేస్తుంది.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

Continues below advertisement
Sponsored Links by Taboola