JioFinance Service: జియో ఫైనాన్స్ యాప్ మనదేశంలో లాంచ్ అయింది. ఆర్థిక అవసరాల కోసం ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. దీన్ని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ డెవలప్ చేసింది. ఈ యాప్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని ద్వారా యూపీఐ లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం, వాటిని మానిటర్ చేసుకోవడం, బిల్ పేమెంట్స్ చేయడం వంటివి చేయవచ్చు. ఈ సర్వీసు మొట్టమొదటగా 2024 మే నెలలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 60 లక్షల మంది దీని సేవలను ఉపయోగించుకుంటున్నారు.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


జియోఫైనాన్స్ యాప్ ఫీచర్లు (JioFinance App Features)
జేఎఫ్ఎస్ఎల్ (జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్) తెలుపుతున్న దాని ప్రకారం జియో ఫైనాన్స్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లేస్టోర్‌లో, ఐవోఎస్ యూజర్లకు యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉండనుంది. మైజియో ప్లాట్‌ఫాం నుంచి కూడా దీన్ని యాక్సెస్ చేయవచ్చు.


జియో ఫైనాన్స్ ద్వారా యూజర్లు యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా వ్యాపార లావాదేవీలు జరపవచ్చు. ఇతర యూపీఐ యాప్‌లకు డబ్బులు పంపడాన్ని ఇది సపోర్ట్ చేస్తుంది. యూపీఐ ఐడీలు రిమూవ్ చేయడం, బ్యాంక్ అకౌంట్లు చేయడం వంటి వాటిని కూడా యాప్ ద్వారా మేనేజ్ చేయవచ్చు. ప్రతి యూపీఐ లావాదేవీపై రివార్డ్స్ కూడా అందించనున్నారు.


అంతేకాకుండా ఈ యాప్ మీ బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా మరింత సులభతరం చేయనుంది. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్స్‌ను మూడు స్టెప్స్‌లో ఓపెన్ చేయవచ్చు. దీన్ని ఉపయోగించి వినియోగదారులు నెఫ్ట్, ఐఎంపీఎస్ ద్వారా నగదు లావాదేవీలు జరపవచ్చు. ఫిజికల్ డెబిట్ కార్డు కూడా పొందవచ్చు.


యుటిలిటీ బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జ్, ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్, క్రెడిట్ కార్డు పేమెంట్లను ఈ యాప్ నుంచి చేయవచ్చు. లోన్ ఆన్ ఛాట్ ఫీచర్ ద్వారా రుణాలను కూడా పొందవచ్చు. లోన్ లిమిట్ మొత్తానికి కాకుండా ఎంత ఉపయోగించామో అంత మొత్తానికే వడ్డీ కట్టే ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. జియో ఫైనాన్స్ యాప్ శాలరీ ఎంప్లాయీలకు కూడా అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా ఇన్సురెన్స్ కూడా లభించనుంది. లైఫ్, హెల్త్, టూవీలర్, మోటార్ ఇన్సూరెన్స్‌లు జియో ఫైనాన్స్ యాప్ ద్వారా తీసుకోవచ్చు. మొత్తంగా ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్‌కు జియో ఫైనాన్స్ గట్టి పోటీని ఇవ్వనుందని అనుకోవచ్చు.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?