Tesla Chief Elon Musk unveils Robo Taxi  Robo Van : టెస్లా సీఈఓ ఇలొన్‌మస్క్‌ ఐ రోబోట్‌ ఈవెంట్‌లో రోబోవ్యాన్‌, సైబర్‌ క్యాబ్‌లను ప్రపంచానికి పరిచయం చేశారు. వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ లో నిర్వహింంచిన కార్యక్రమంలో సైబర్ క్యాబ్ ఎక్కి మరీ వచ్చారు.  ఈ ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలను ప్రపంచం ముందు ఉంచేందుకు ఉద్దేశించారు.  మస్క్ ఈ ఈవెంట్‌ను ‘ఫ్యూచర్‌ వరల్డ్‌’గా చెప్పుకొచ్చారు. సైబర్ క్యాబ్‌లో ఇద్దరు..   రోబోవన్‌ కారులో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది డ్రైవర్‌లెస్‌ కారు. ఈ ఎలక్ట్రిక్‌ కారు పూర్తి ఆటోమేషన్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది.

  





 
‘వీ, రోబోట్’ పేరిట వీటిని ఆవిష్కరించారు. ఈ కార్లు ఇతర కార్ల కన్నా  20 రెట్లు సురక్షితమైనవని ఎలాన్ మస్క్ చెబుతున్నారు.  2026 కల్లా సైబర్ క్యాబ్ ఉత్పత్తి జరుగుతుంది. సైబర్ వ్యాన్‌లను వచ్చే ఏడాదికల్లా టెక్సాస్, క్యాలిఫోర్నియా నగరాల్లోని రోడ్ల  మీదకు తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డ్రయివర్ లెస్ కార్లలో ప్రజలు పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ లేక పనిచేసుకుంటూ లేక ఏదో విధంగా కాలం గడుపవచ్చునని ఎలన్ మస్క్ తన ఆవిష్కరణ ప్రసంగంలో తెలిపారు.  



సైబర్ క్యాబ్, రోబోవ్యాన్‌లో డ్రైవర్‌ క్యాబిన్‌ కూడా ఉండదు. ఒక్క స్క్రీన్ తప్ప ఇంకేమీ ఉండవు..  సైబర్‌క్యాబ్‌ను ఇండక్టివ్ ఛార్జర్ ద్వారా వైర్‌లెస్‌ విధానంలో ఛార్జ్‌ చేసేలా రూపొందించారు. మస్క్ రిలీజ్ చేసిన ఈ ప్రోటోటైప్ వాహనాలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి.  



తెలుగు సినిమాల్లో ఆదిత్య 369 వంటి సినిమాల్లో దర్శకుల ఊహాలోకంలో సృష్టించిన తరహా వాహనాలను ఇక్కడ మస్క్ ఒరిజినల్ కార్లగా రూపుదిద్దుతున్నారని సోషల్ మీడియాలో కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.  





 టెస్లా కార్లతో ఇప్పటికే డ్రైవర్ లెస్ , ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో  సంచలనం సృష్టించిన మస్క్.. అంతరిక్షంలోనూ విజయం సాధించడానికి స్పేస్ ఎక్స్ ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ట్విట్టర్ ను కూడా కొనుగోలు చేశారు.