Free OTT Plan: మీరు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌ని చూడటానికి ఇష్టపడే వాళ్లయితే, ఫ్రీగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్ ఎక్కడ దొరుకుతుందా అని వెతికే ఉంటారు. అనేక టెలికాం కంపెనీలు తమ అనేక ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో ఓటీటీ ప్లాన్ల సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తాయి. ఇప్పుడు అన్ని కంపెనీలు అందించే చవకైన ఓటీటీ ప్లాన్ల గురించి తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ అందించే చవకైన ఓటీటీ ప్లాన్ (Airtel Cheapest OTT Plan)
మీరు ఎయిర్‌టెల్ సిమ్‌ని ఉపయోగించే వారైతే, చవకైన ప్లాన్‌తో ఉచిత ఓటీటీ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. దీని కోసం మీరు రూ. 149తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్‌తో ఎటువంటి కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లేవు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఇప్పటికే ఉన్న యాక్టివ్ ప్లాన్‌తో 1 జీబీ అదనపు డేటాను పొందుతారు. దానితో 30 రోజుల పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు. దీంతో వినియోగదారులు సోనీలివ్, లయన్స్‌గేట్ ప్లే, సన్‌నెక్స్ట్ వంటి అనేక ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను ఆస్వాదించవచ్చు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
జియో అందించే చవకైన ఓటీటీ ప్లాన్ (Jio Cheapest OTT Plan)
మీరు జియో సిమ్‌ని ఉపయోగించే వారైతే... రూ.175 ప్లాన్‌తో ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్‌తో కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లేవు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 10 జీబీ అదనపు డేటా, 28 రోజుల పాటు 10 ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు జియో సినిమా ప్రీమియం, జియో టీవీ మొబైల్ యాప్‌ల్లో వచ్చే మొత్తం కంటెంట్‌ను చూడగలరు. దీంతో వినియోగదారులు సోనీ లివ్, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్ వంటి అనేక ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను ఎంజాయ్ చేయవచ్చు.
వొడాఫోన్ ఐడియా అందించే చవకైన ఓటీటీ ప్లాన్ (Vi Cheapest OTT Plan)
మీరు వొడాఫోన్ ఐడియా అంటే వీఐ సిమ్‌ని ఉపయోగిస్తుంటే, కేవలం రూ.95 ప్లాన్‌తో ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్‌తో ఎటువంటి కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లేవు. దీని ద్వారా వినియోగదారులు 14 రోజుల పాటు 4 జీబీ అదనపు డేటాను పొందుతారు. ఇది కాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌తో 28 రోజుల పాటు సోనీలివ్ ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?