Jio vs Airtel Data Recharge Plans: భారతదేశంలోని మూడు ప్రధాన టెలికాం కంపెనీలు జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు సరసమైన ధరలకు మెరుగైన డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి. చవకైన, ఎక్కువ డేటా అందించే ప్లాన్‌లను ఏ కంపెనీ ఆఫర్ చేస్తుందో తెలుసుకోవడం తరచుగా కస్టమర్‌లకు కష్టంగా ఉంటుంది. జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న 2 జీబీ డైలీ డేటా ప్లాన్‌లలో ఏది ఎక్కువ పొదుపుగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్లాన్ల ద్వారా మీరు తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. వీటి కారణంగా మీ అవసరానికి అనుగుణంగా మెరుగైన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.


జియో రూ.198 ప్లాన్ (Jio Rs 198 Plan)
జియో అందించే చవకైన రీఛార్జ్ ప్లాన్. ఇది 14 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో కంపెనీ తన వైపు నుంచి ప్రతిరోజూ 2 జీబీ డేటాను అందిస్తుంది. ఇది కాకుండా ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజువారీ 100 ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని కూడా జియో అందిస్తుంది. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభించనుంది.



Also Read: అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!


జియో రూ.349 ప్లాన్ (Jio Rs 349 Plan)
జియో అందిస్తున్న ఈ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ కింద మీకు ప్రతిరోజూ 2 జీబీ డేటా అందిస్తున్నారు. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ప్రతి రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. అంతే కాకుండా పైన తెలిపిన అదనపు సబ్‌స్క్రిప్షన్లను కూడా జియో దీని ద్వారా అందించనుంది.


ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్ (Airtel Rs 199 Plan)
ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో రీఛార్జ్ చేసుకుంటే కస్టమర్లకు ప్రతిరోజూ 2 జీబీ డేటా అందించనున్నారు. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభిస్తాయి.


ఎయిర్‌టెల్ రూ. 379 ప్లాన్ (Airtel Rs 379 Plan)
ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ఒక నెలగా ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్ కింద కస్టమర్లు ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందుతారు. ఈ మంత్లీ రీఛార్జ్ ప్లాన్ ప్రతి రోజూ అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.


ఇటీవలే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి ప్రైవేటు టెలికాం కంపెనీలు టారిఫ్‌ల రేట్లను భారీగా పెంచేశాయి. దీంతో యూజర్లందరూ బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. దీనికి తగ్గట్లే బీఎస్ఎన్ఎల్ కూడా ప్లాన్ల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుంది. తక్కువ ధరకి ఎక్కువ లాభాలను ఇచ్చే ప్లాన్లను తీసుకురావడం ప్రారంభించింది. దీంతో బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ఇప్పుడు జియో, ఎయిర్‌టెల్ తమ పెంచిన టారిఫ్ ధరలను తిరిగి తగ్గించనున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంత వరకు నిజమో చూడాల్సి ఉంది.



Also Read: వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!