Jio Unlimited 5G Data Plan: రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ. కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ఈ కంపెనీ భారతదేశంలో గరిష్టంగా 49 కోట్ల మంది వినియోగదారులను చేరుకుంది. అయితే 2024 జూలైలో కంపెనీ తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను గణనీయంగా పెంచింది. దీని కారణంగా వినియోగదారులు చాలా నిరాశకు గురయ్యారు.


చాలా మంది వినియోగదారులు జియోను వదిలి ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌లో చేరారు. అయితే మీరు రిలయన్స్ జియో యూజర్ అయితే మీరు అన్‌లిమిటెడ్ డేటాతో పాటు అనేక ఓటీటీ యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందే రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు. 


రిలయన్స్ జియో తీసుకువచ్చిన ఈ ప్రత్యేక ప్లాన్‌లో వినియోగదారులు ఒకటి లేదా రెండు మాత్రమే కాకుండా 12 OTT యాప్‌ల సభ్యత్వాన్ని పొందుతారు. ఇది కాకుండా, వినియోగదారులు రోజువారీ డేటా పరిమితితో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా ప్రయోజనాలను కూడా పొందుతారు.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


అన్‌లిమిటెడ్ 5జీ డేటా
ఈ జియో ప్లాన్ ధర కేవలం రూ. 448. ఈ ప్లాన్‌లో మీరు 28 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ప్రతిరోజూ 2 జీబీ డైలీ డేటాను జియో అందించనుంది. అంటే మీకు మొత్తం 56 జీబీ డేటా లభిస్తుంది. ఇది కాకుండా మీరు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌ల బెనిఫిట్స్‌ను కూడా పొందుతారు. ఈ విషయాలన్నీ కాకుండా జియో ట్రూ 5జీ ప్రోగ్రామ్‌లో భాగమైన ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను కూడా పొందుతారు.


అంటే ఈ ప్లాన్‌తో వినియోగదారులు ప్రతిరోజూ కేవలం 2 జీబీ డేటా మాత్రమే కాకుండా అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. అయితే దీని కోసం మీరు 5జీ కనెక్టివిటీ ఉన్న ప్రాంతంలో నివసించాల్సి ఉంటుంది.


12 ఓటీటీ యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్
ఈ ప్రయోజనాలతో పాటు జియో  ప్లాన్ 12 ఓటీటీ యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది. ఇది ఈ ప్లాన్ అందించే అత్యంత ప్రత్యేక లాభం. ఈ 12 ఓటీటీ యాప్‌లలో సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్‌నెక్స్ట్, కంచా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపల్, ఫ్యాన్ కోడ్, హోయ్‌చోయ్, జియో సినిమా ప్రీమియం, జియోటీవీ వంటి లాభాలు ఉన్నాయి. మీరు ఈ రూ. 448 ప్లాన్‌లో మాత్రమే ఈ ఓటీటీ యాప్‌లన్నింటినీ ఆస్వాదించగలరు.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే