Jio Cheapest Recharge Plan: రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించింది. ఎందుకంటే ఈ కంపెనీ అత్యధికంగా 49 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. 2024 జూలైలో జియో తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరను పెంచింది. రిలయన్స్ జియో కస్టమర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.


జియో ఖరీదైన ప్లాన్ల కారణంగా వందలాది మంది వినియోగదారులు జియోని విడిచిపెట్టారు. చవకైన రీఛార్జ్ ప్లాన్లను అందించే బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీల్లో చేరారు. ఇప్పటికీ జియోతోనే కొనసాగుతున్న వారు అదే కంపెనీ అందిస్తున్న తక్కువ ధర కలిగిన రీఛార్జ్ ప్లాన్ల కోసం వెతుకుతున్నారు.


జియో చవకైన 5జీ ప్లాన్
మీరు ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పటికీ ఖరీదైన ప్లాన్‌లను కొనుగోలు చేయలేని పక్షంలో జియో అందిస్తున్న ఈ చవకైన ప్లాన్ గురించి తెలుసుకోవడం మంచిది. దీనిలో మీరు రూ. 200 కంటే తక్కువ ధరకే అపరిమిత డేటా సౌకర్యం పొందుతారు. ఈ ప్లాన్ ద్వారా మీరు మీకు కావలసినంత డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇందులో మీరు రోజువారీ లిమిట్ కూడా గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు.


రోజువారీ 2 జీబీ డేటాతో పాటు మీరు రోజుకు 8 నుంచి 10 జీబీ డేటాను కూడా ఉపయోగించగలరు. జియో అందిస్తున్న ఈ అద్భుతమైన ప్లాన్ గురించి తెలుసుకుందాం. జియో అందిస్తున్న ఈ ప్లాన్ ధర రూ. 198 మాత్రమే. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందుతారు. ఇది మాత్రమే కాకుండా ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ డేటాను పూర్తిగా ఉచితంగా పొందుతారు.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


అపరిమిత 5జీ డేటా కూడా...
వినియోగదారులు తమ రోజువారీ 2 జీబీ ఇంటర్నెట్ డేటాతో పాటు అపరిమిత 5జీ డేటాను ఆస్వాదించవచ్చు. దీని కారణంగా మీరు కోరుకున్నంత ఎక్కువ డేటాను ఖర్చు చేయవచ్చు. ఇప్పటి వరకు ఇది జియో చవకైన అపరిమిత ఉచిత 5జీ డేటా ప్లాన్ ఇదే. ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్‌ని రీఛార్జ్ చేసుకుంటే మీరు తర్వాతి 14 రోజుల పాటు డేటా పరంగా పూర్తిగా ఉచితం అన్నమాట.


మీరు ఈ కేటగిరీలో 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, దాని కోసం రూ.349 వెచ్చించాల్సి ఉంటుంది. జియో అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్, 2 జీబీ డేటాను పొందుతారు. ఇది కాకుండా మీరు ఈ ప్లాన్‌తో అపరిమిత 5జీ డేటాను పూర్తిగా ఉచితంగా పొందుతారు. అయితే ఈ ఆఫర్‌ను పొందాలంటే మీరు తప్పనిసరిగా 5జీ ఫోన్‌ని కలిగి ఉండాలి. కొన్ని నెలల క్రితం జియో సహా ప్రైవేటు టెలికాం కంపెనీలు అన్నీ టారిఫ్‌ల ధరను పెంచాయి. దీంతో ప్రైవేటు కంపెనీల నుంచి బీఎస్ఎన్ఎల్‌కు సబ్‌స్క్రైబర్లు పోర్టు అవుతున్నారు.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?