Skoda Elroq EV: స్కోడా గ్లోబల్ మార్కెట్లో తన కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎల్రోక్ గ్లింప్స్‌ను టీజ్ చేసింది. స్కోడా ఇండియా ఈ కారును భారతదేశానికి తీసుకువచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. స్కోడా ఎన్యాక్ కంటే కాస్త తక్కువ రేంజ్‌లో స్కోడా ఎల్రోక్ ఉంచవచ్చు. ఎన్యాక్ పూర్తిగా ఫారిన్ మేడ్ కారు. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో స్కోడా లాంచ్ చేసిన మొదటి కారు.


స్కోడా ఎల్రోక్ రేంజ్, ధర
స్కోడా కొత్త ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 560 కిలోమీటర్ల రేంజ్‌ను డెలివర్ చేయనుంది. ఈ స్కోడా ఎల్రోక్ ఇండియాకు వస్తే దీని ఎక్స్ షోరూం ధర దాదాపు రూ. 30 లక్షల వరకు ఉండవచ్చు. స్కోడా ఎల్రోక్ ధర ఎక్కువగా ఉండటానికి కారణం ఈ కారు పూర్తిగా విదేశాల్లో తయారవడమే.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?


స్కోడా కొత్త ఈవీకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది ఇవే...
స్కోడా ఎల్రోక్... టాటా కర్వ్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీలకు గట్టి పోటీని ఇవ్వగలదు. టాటా మోటార్స్ ఇటీవల భారతీయ మార్కెట్లో కర్వ్ ఈవీని విడుదల చేసింది. టాటా కర్వ్ ఈవీ టాప్ మోడల్ ధర రూ. 22 లక్షలకు చేరుకుంది. ఇది ఎల్రోక్ కంటే రూ. 8 లక్షలు చవకగా ఉండనుంది. హ్యుందాయ్ క్రెటా ఈవీ కూడా స్కోడా ఎల్రోక్ కారుకు ప్రత్యర్థిగా మారవచ్చు. హ్యుందాయ్ లాంచ్ చేయనున్న ఈ ఎలక్ట్రిక్ కారు 2025 జనవరిలో మార్కెట్లోకి ప్రవేశించనుందని తెలుస్తోంది. క్రెటా ఈవీ ధర రూ. 22 లక్షల నుంచి రూ. 26 లక్షల మధ్యలో ఉండవచ్చు.


స్కోడా ఎల్రోక్ ఫీచర్లు
స్కోడా ఎల్రోక్‌ను మూడు బ్యాటరీ ప్యాక్‌లతో గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. దీని ఎంట్రీ లెవల్ మోడల్ అయిన ఎల్రోక్ 50... 125 కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్‌తో రానుందని తెలుస్తోంది. అదే సమయంలో స్కోడా ఎల్రోక్ 85 మోడల్ అత్యధిక రేంజ్‌ను ఇవ్వగలదు. దీని టాప్ మోడల్ ఏకంగా 560 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగలదని తెలుస్తోంది.


స్కోడా ఎల్రోక్ ఎలక్ట్రిక్ కారు 13 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటుంది. అలాగే ఇది ఏకంగా 470 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఈ కారులో ఏడీఏఎస్ ఫీచర్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. కారుకు హెడ్ అప్ డిస్‌ప్లే, మెమరీ, మసాజ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు కూడా అందించనున్నారు. 


Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే